ఎస్పీ–11 జట్టు గెలుపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా జర్నలిస్టులు, ఏలూరు జిల్లా ఎస్పీ–11 జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో ఎస్పీ–11 జట్టు విజయం సాధించింది. ఆదివారం ఆశ్రం వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్పీ జట్టులో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి బ్యాటింగ్‌లో 56 పరుగులు, బౌలింగ్‌లో 4 వికెట్లు తీశారు. ఎస్పీ 11 జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. జట్టులో సీఐ బోణం ఆదిప్రసాద్ 50 పరుగులు సాధించి ఆకట్టుకున్నారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జర్నలిస్టుల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్పీ శివకిషోర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment