చేపల దొంగలు !
● చెరువులు ఎండగడుతున్న పచ్చ నేతలు
● అక్రమంగా చేపలు పట్టివేత
● పట్టించుకోని అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మట్టి.. పుట్ట.. చెట్టు.. చేమ.. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు పచ్చనేతలు చెలరేగిపోతున్నారు. బడానేతలు పట్టిసీమ, తమ్మిలేరు మ ట్టి దోచుకుంటుంటే.. చోటామోటా నాయకులు గ్రా మాల్లో చెరువులపై కన్నేశారు. ప్రజలకు తాగునీరు అందించే చెరువులను ఎండగట్టేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నా అధికారు లు మిన్నుకుండిపోయారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ప్రశ్నించలేకపోతున్నారు.
పోణంగి చెరువుకు ఎసరు
ఏలూరు నగర కార్పొరేషన్, 14 డివిజన్ పరిధి పో ణంగిలో ఐదు ఎకరాల తాగునీటి చెరువు ఉంది. అధికారులు ఈ చెరువు నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేసేవారు. పశువులు దాహం తీర్చుకునేవి. రెండురోజుల క్రితం ఈ చెరువులో ఉన్న చేపలపై స్థానిక టీడీపీ నాయకుడి కన్ను పడింది. అధికారం అడ్డం పెట్టుకుని చెరువులో నీటిని తోడించేశాడు. ఆదివారం కూలీలతో చేపలు పట్టి అమ్ముకున్నాడు. ఇది చూసిన గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకున్నా రు. రానున్నది వేసవికాలం కావడంతో చెరువు ఎండగడితే కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు ఉండదని ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గతేడాది ఏలూరు కార్పొరేషన్ అధికారులు చెరువులో చేపల వేలం పాట నిర్వహించి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.
చాటపర్రులోనూ ఇదే తంతు
ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో సైతం ప చ్చనేతలు ఇదే తరహా దందా కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం పంచాయతీకి చెందిన 40 ఎకరా ల తాగునీటి చెరువును ఎండగట్టారు. అక్రమంగా చేపలు పట్టి సొమ్ము చేసుకున్నారు. వారం పాటు సాగిన ఈ దందాపై అధికారులు కనీసం ప్రశ్నించలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఈ చెరువులో చేపలను వేలం వేయగా సుమారు రూ.90 వేలు పంచాయతీ ఖజానాకు జమైంది.
చేపల దొంగలు !
Comments
Please login to add a commentAdd a comment