కూటమి నేతల బెదిరింపులకు భయపడొద్దు
పెదవేగి: కూటమి నేతల తప్పుడు కేసులకు భయపడవద్దని, పార్టీ శ్రేణులంతా ధైర్యంగా ఉండాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌ దరి అన్నారు. ఆదివారం మండలంలోని కొండలరావుపాలెంలో దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల ఏర్పాటుపై సమీక్షించా రు. అనంతరం అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ త క్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజ లు పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇదే సమయంలో కరోనా వంటి విపత్తు సమయంలో నూ మాజీ సీఎం జగన్ అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచి నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసు లు బనాయిస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు. దెందులూరులో రౌడీ రాజకీయం నడుస్తోందని మండిపడ్డారు. నాయకులు ఎంపీపీ తాతా రమ్య, కొత్తూరు సూర్యనారాయణ, తొత్తడి వేదకుమారి, కామిరెడ్డి నాని, మేక లక్ష్మణరావు, జా నంపేట బాబు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, సర్పంచ్ మాత్రపు కోటేశ్వరరావు, లీగల్ సెల్ కన్వీనర్ బైగాని రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment