●ఇంటిని తవ్వి.. ఎత్తును పెంచి..
ఆధునిక టెక్నాలజీతో ఇంటిని ఐదడుగుల మేర ఎత్తు లేపుతున్నారు. దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో చేస్తున్న పనులను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. గ్రామానికి చెందిన మోదుగుమూడి రాంబాబు సుమారు 29 ఏళ్ల క్రితం నాలుగు సెంట్ల స్థలంలో రెండస్తుల భవనం నిర్మించారు. అనంతరం రోడ్ల నిర్మాణంతో ఇల్లు లోతట్టు ప్రాంతమై వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇంటిని పైకి లేపించాలని భావించిన యజమాని నెల్లూరులో ఓ కాంట్రాక్టర్‌ను కలిశారు. 230 జాకీలు, 41 మంది కా ర్మికులతో పనులు మొదలుపెట్టారు. భవనం కింద ఐదడుగుల మేర తవ్వి ఇంటి చుట్టూ గోడ కట్టి చెక్కలు పెట్టారు. చెక్కల మీద 230 జాకీలను అమర్చారు. బుధవారం కార్మికులను తీసుకువచ్చి ఇంటిని పైకి లేపనున్నారు. 40 రోజుల్లో పనులు పూర్తిచేయనున్నారు.
– దెందులూరు
●ఇంటిని తవ్వి.. ఎత్తును పెంచి..
Comments
Please login to add a commentAdd a comment