63 వేల కోడి గుడ్లు పూడ్చివేత
ఉంగుటూరు: కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో బాదంపూడి వెంకట మణికంఠ ఫౌల్ట్రీ ఫారంలో మూడోరోజు ఆదివారం కోళ్ల ఖననం కార్యక్రమం కొనసాగింది. పశుసంర్ధకశాఖ డా క్టర్లు, సిబ్బంది 43 వేల కోళ్లను ఖననం చేశారు. దీంతో ఫారంలోని 1.13 లక్షల కోళ్ల ఖననం ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే వ్యాధి సోకిన కోళ్లు పెట్టిన 63 వేల గుడ్లను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. పశుసంవర్ధకశాఖ జేడీ డి.గో విందరాజు పర్యవేక్షించారు. సోమవారం సమీ ప పెదతాడేపల్లిలోని ఫారంలో కోళ్ల ఖననం ప్రక్రియ చేపట్టనున్నారు.
డ్రోన్‌తో హైపోక్లోరైడ్ పిచికారీ
గ్రామంలో పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రెండు డ్రోన్ల ద్వారా పిచికారీ చేయించారు. 300 లీటర్ల హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్టు పంచాయతీ కార్యదర్శి గిరిధర్ తెలిపారు. గ్రామంలోని రెడ్‌జోన్‌లో ఉన్న కిలోమీటర్ పరిధిలో ఈ పనులు చేయించారు.
నేటి మీకోసం రద్దు
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ) ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏలూరు కలెక్టరేట్, డివిజనల్, మున్సిపల్, మండల కార్యాలయాల్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment