సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): అంగన్‌వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందాలను అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ ఐిసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్– హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్‌లుగా చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినదించారు. యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు రజనీ అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్‌ను నెరవేర్చలేదని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మె ఒప్పందం అమలు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని అమలుకు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. విజయలక్ష్మి, పి.హైమావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment