ఉత్తమ ఇంగ్లీష్ టీచర్‌గా కంకర్ల దాస్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మండలంలోని చొదిమెళ్ళ ఎంపీపీ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ కంకర్ల దాస్ దక్షిణ భారత స్థాయిలో ఉత్తమ ఇంగ్లీష్ టీచర్‌గా ఎంపికయ్యారు. సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లీస్ లాంగ్వేజ్ టీచింగ్ (సీఈఎల్‌టీ)కోర్సులో భాగంగా రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా (ఆర్‌ఐఈఎస్‌ఐ)ఆధ్వర్యంలో బెంగళూరులో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 14 వరకూ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న ఇంగ్లీష్ టీచర్ కంకర్ల దాస్ ఉత్తమ ఇంగ్లీష్ టీచర్‌గా ఎంపికయ్యారు. బెంగళూరు ఆర్‌ఐఈఎస్‌ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎస్ మణి, పలు రాష్ట్రాలకు చెందిన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు దాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. దాస్ మాస్టారును ఏలూరు మండల విద్యాశాఖాధికారి –1 ఏ. రవిప్రకాష్, 2 డీవీ రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. రవికుమార్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment