సంస్థలో పనిచేసే ఇద్దరిపై కేసు నమోదు
ఏలూరు టౌన్: ప్రైవేట్ ఫైనాన్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందే నకిలీ నగలు తాకట్టుపెట్టి భారీగా డబ్బులు కాజేశారు. ఈ మోసం బయటపడడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు పవర్‌పేటలో ముత్తూట్ ఫైనాన్స్ పేరుతో బంగారు నగల తాకట్టు దుకాణం ఉంది. ఈ బ్రాంచ్‌లో ఏలూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. వీరు కొంతకాలం క్రితం ముత్తూట్ ఫైనాన్స్‌లో నకిలీ నగలను తాకట్టుపెట్టి రూ.12,31,600 రుణంగా తీసుకున్నారు. బ్రాంచ్‌లో పనిచేస్తున్న సిబ్బంది కావడంతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండానే రుణం మంజూరు చేశారు. రెండు రోజుల క్రితం మూత్తూట్ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ వేల్పూరి రాజేష్ ఏలూరులోని పవర్‌పేట బ్రాంచ్‌కు వచ్చారు. ఆయన బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన బంగారు నగలను తనికీ చేశారు. ఈ తనికీల్లో తాకట్టులోని నగలు నకిలీగా నిర్థారించారు. ఈ నగలను తాకట్టు పెట్టిన వ్యక్తుల వివరాలు ఆరా తీయగా బ్రాంచ్‌లో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. దీనిపై రీజనల్ మేనేజర్ రాజేష్ ఏలూరు టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగకళ్యాణి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పిచ్చికుక్క దాడి.. 8 మందికి గాయాలు
కొయ్యలగూడెం: కన్నాపురంలో పిచ్చికుక్క స్వైర విహారంతో 8 మంది గాయాలపాలయ్యారు. దీంతో గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను వెంటాడి హతమార్చారు. పిచ్చికుక్క మరికొన్ని కుక్కలపై దాడి చేసిందని, ఈ నేపథ్యంలో మిగిలిన కుక్కల పరిస్థితి పట్ల అప్రమత్తతతో ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment