
27న ఖేలో ఇండియా సెంటర్ ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్: ఈ నెల 27వ తేదీన ఏలూరు స్టేట్ లెవెల్ ఖేలో ఇండియా సెంటర్‌లో శిక్షణ కోరే బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని సెంటర్ ఇన్‌చార్జి డీఎన్‌వీకే ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్‌లో బాలబాలికలకు, వెయిట్ లిఫ్టింగ్‌లో బాలికలకు మాత్రమే ఎంపిక పోటీలు చేపడతామన్నారు. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు గలవారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లతో ఏలూరు ఆల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న వారికి వార్డెన్ పర్యవేక్షణలో కోచ్‌తో ఉచిత శిక్షణ, వసతి, పౌష్టికాహారం, రూ.4 వేలు స్కూల్ ఫీజ్, ఆరోగ్య బీమా, స్పోర్ట్ కిట్ అందిస్తామని వెల్లడించారు. ఆసక్తి గలవారు 98853 12356 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వర్జీనియా బేరన్ దగ్ధం
కొయ్యలగూడెం: దిప్పకాయలపాడులో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో వర్జీనియా పొగాకు బేరన్ దగ్ధం అయ్యింది. పొగాకు బేరన్ ఉదయం వేళ క్యూరింగ్ దశలో ఉండగా రేషన్ కర్ర విరిగి పొయ్యి గొట్టంపై పడడంతో ప్రమాదం సంభవించిందని రైతు బొట్ట వెంకటరమణ వాపోయాడు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్రం అధికారి జి.అబ్రహం సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. బేరన్ పూర్తిగా దగ్ధం అయ్యిందని, సుమారు రూ.3 లక్షల నష్టం ఉంటుందని అబ్రహం తెలిపారు.
8 క్వింటాల బేరన్ పొగాకు దగ్ధం
కామవరపుకోట: ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని 8 క్వింటాల బేరన్ పొగాకు దద్ధమైంది. రావికంపాడు పంచాయతీ రెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాణికుల శ్రీను, మానికల సత్యనారాయణ పొగాకు సాగు చేస్తారు. మంగళవారం మధ్యాహ్నం పొగాకును క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బేరన్‌లో ఉన్న పొగాకు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక రైతులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రైతులకు సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
యువతి ఆత్మహత్య
నరసాపురం రూరల్: కొప్పర్రు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పంటకాలువ సమీపంలో ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న ఎరిచర్ల సిరి అనే యువతి సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు చందు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమాచారంపై పోలీసులను సంప్రందించినా వారు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment