ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ప్రయోగ పరీక్షలకు మంగళవారం 2005 మంది హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 34 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 2059 మందికి 2005 మంది హాజరు కాగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 975 మందికి 957 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 1,084 మందికి 1048 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment