పైడిపర్రులో టెర్రర్‌ | - | Sakshi
Sakshi News home page

పైడిపర్రులో టెర్రర్‌

Published Thu, Feb 20 2025 8:58 AM | Last Updated on Thu, Feb 20 2025 8:54 AM

పైడిప

పైడిపర్రులో టెర్రర్‌

కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే..

కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి పైడిపర్రులో శాంతి భద్రతలు క్షీణించాయని, నోరెత్తితే దాడిచేసే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌ బెట్టింగ్‌లు, జూదాలకుతోడు రౌడీ మూకలు పేట్రేగిపోతుండగా, యువత, చిన్న పిల్లలకు సైతం గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసే పరిస్థితి పైడిపర్రులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం పైడిపర్రు స్పార్క్‌ హోటల్‌లో భారీ కోతాటను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైడిపర్రులో పేకాటను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతనెల 31వ తేదీన రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్సై ఏజీఎస్‌ మూర్తి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో పోలీసు యంత్రాంగం కుదేలైంది.

ప్రత్యేక బీట్‌లు నిర్వహిస్తున్నాం

ఈ ఘటనలపై రూరల్‌ ఎస్సై చంద్రశేఖర్‌ను సాక్షి వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ దొంగతనాల వ్యవహారంపై పోలీసులు బృందాలుగా విచారణ చేస్తున్నారని, అనుమానితులను గుర్తిస్తున్నామని చెప్పారు. పేకాటలపై సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేక బీట్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

తణుకు అర్బన్‌: పైడిపర్రు గ్రామంలో లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పింది. దొంగల స్వైరవిహారం.. రౌడీ మూకల బెదిరింపులు.. జూదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఈ ప్రాంతం మారింది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో పైడిపర్రువాసులు హడలిపోతున్నారు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సయయంలో 1 గంట నుంచి 5 గంటలలోపు పైడిపర్రు ప్రాంతంలో దొంగలు స్వైరవిహారం చేశారు. ఒక మహిళ మెడలో 3 కాసుల బంగారు గొలుసు గుంజుకుని పారిపోగా.. మరో ఇంటి మందు పార్కింగ్‌ చేసిన మోటార్‌సైకిల్‌ను అపహరించారు. గణేశుల సూర్యనారాయణ, ఆరేటి సతీష్‌, పంగం శంకరం, యర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఇళ్లలో తలుపులు పగులగొట్టి, తాళాలు విరగ్గొట్టి, కిటికీ చువ్వలు విరిచేసి, తలుపుల గెడలు వంచేసి ఇలా విధ్వంసం సృష్టించారు. దొంగలు చేసిన శబ్దాలకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించారు. ఒక దొంగ నిక్కరుతో ఉన్నాడని, మరో దొంగ ఫ్యాంటు ధరించి ఉన్నారని బాధితులు చెబుతుండడంతో ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ దొంగతనాలన్ని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరగడం విశేషం. పైడిపర్రు ప్రాంతం మునిసిపాలిటీలో 4 వార్డులుగా కలిసి ఉన్నప్పటికీ ఆ ప్రాంతం ఇంకా గ్రామస్థాయి వాతావరణాన్నే కలిగి ఉంటుంది. 15వేల జనాభా ఉన్న ఈ పైడిపర్రులో 2500 పైగా ఇళ్లు ఉన్నాయి.

ఆందోళనలో పైడిపర్రువాసులు

ఇటీవల ఫ్లెక్సీ వివాదంలో ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రౌడీ మూకలు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరచడం, అలాగే ఒక ఇంట్లో పేకాట నిర్వహించడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఈనెల 16వ తేదీన శ్రీబాల వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గ్రామపెద్దలు సమావేశమై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే రాత్రి దొంగలు స్వైరవిహారం చేయడం విశేషం.

గ్రామంలో గాడితప్పిన లా అండ్‌ ఆర్డర్‌

ఒకే రాత్రి 6 ఇళ్లలో చోరీకి యత్నం

గృహాల్లోనే పేకాట శిబిరాలు

ఇటీవల చాకుతో యువకుడిపై దాడిచేసిన పేకాట బ్యాచ్‌

ఎస్సై ఆత్మహత్యతో కొరవడిన పోలీసు నిఘా

బంగారు తాడు గుంజుకుపోయాడు

17వ తేదీ తెల్లవారుజాము 5 గంటల సమయంలో మొదటి అంతస్తు భవనంలో గుమ్మం శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి నా మెడలోని 3 కాసుల బంగారు తాడును గుంజుకుని పారిపోయాడు. నా భర్త గత కొంతకాలంగా వేరొక మహిళతో ఉంటుండగా దొంగ వెళ్తూవెళ్తూ ఆవిడ పేరు ప్రస్తావిస్తూ ఆమె జోలికొస్తే చంపేస్తానని హెచ్చరించి పారిపోయాడు. –దేవ లక్ష్మి నవదుర్గ

భయాందోళన సృష్టించారు

మా ఇంటి ముందు పెట్టిన మోటార్‌సైకిల్‌ 17వ తేదీన తెల్లవారిన తరువాత చూస్తే కనిపించలేదు. అదే రోజు రాత్రి నా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా దొంగలు హల్‌చల్‌ చేశారు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లు మాత్రమే దోచుకునే దొంగలు ఇప్పుడు ఇంట్లో మనుషులు ఉన్న ఇళ్లలోకి సైతం ప్రవేశించారు. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి భయాందోళన పరిస్థితులు లేవు. –చల్లా పెద్దిరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
పైడిపర్రులో టెర్రర్‌ 1
1/4

పైడిపర్రులో టెర్రర్‌

పైడిపర్రులో టెర్రర్‌ 2
2/4

పైడిపర్రులో టెర్రర్‌

పైడిపర్రులో టెర్రర్‌ 3
3/4

పైడిపర్రులో టెర్రర్‌

పైడిపర్రులో టెర్రర్‌ 4
4/4

పైడిపర్రులో టెర్రర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement