చిరువ్యాపారులపై అధికారుల జులుం
ఏలూరు (టూటౌన్): రోడ్డుపక్కన ఆక్రమణల తొలగింపులో భాగంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పోలీసుల సహకారంతో బుధవారం స్థానిక సత్రంపాడు, శాంతి నగర్ ప్రాంతాల్లోని రోడ్డుపక్కన ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను, హోర్డింగ్‌లను, షెల్టర్లను తొలగించారు. దీనిపై కొందరు వ్యాపారాలు కార్పొరేషన్ వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు పక్కకు లాగేశారు. శాంతి నగర్ నేరెళ్ల హోండా షోరూమ్‌కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన పలు దుకాణాలను ఈ సందర్భంగా తొలగించారు. సత్రంపాడు వంతెన వద్ద నుంచి ఇటు సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూలు సెంటర్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించడంతో వారంతా ఆందోళన చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా రోడ్డుకి ఇరువై అడుగుల దూరంలో ఎటువంటి అడ్డూలేని షాపులను కూల్చడం అన్యాయమని వైఎస్సార్ సీపీ ఏలూరు అసెంబ్లీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వైఎస్ శివరావు అన్నారు. బాధిత చిరు వ్యాపారులకు అండగా నిలబడి అధికారులను నిలదీశారు.
ఆక్రమణల పేరుతో
రోడ్డు పక్కన దుకాణాల తొలగింపు
చిరువ్యాపారులపై అధికారుల జులుం
Comments
Please login to add a commentAdd a comment