ఏలూరు (టూటౌన్): ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను రక్షించారు. వివరాల్లోకి వెళితే ఏలూరు రెండో పట్టణ పరిధిలోని అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్న హేమకుమారి స్థానికంగా సీనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ శాఖ కార్యాలయంలో పనిచేస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారి వేధింపులు తాళలేక అసహనానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భీమవరంలో ఉన్న తన సోదరికి తెలియజేసి ఏలూరు తంగెళ్లమూడి బ్రిడ్జి వద్ద తమ్మిలేరులోకి దూకేందుకు ప్రయత్నించింది. హేమకుమారి సోదరి ఈ విషయంపై అభయ రక్షక దళానికి సమాచారం ఇచ్చారు. వెంటనే రెండో పట్టణ సీఐ వెంకటరమణ తన సిబ్బందిని హేమకుమారి వద్దకు పంపి ఆమెను ఆత్మహత్యాయత్నం నుంచి రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమెను రక్షించిన వారిలో మహిళ కానిస్టేబుల్ ప్రియదర్శిని, దేవ మాత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment