ఏలూరు(మెట్రో): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న నిర్వహించనున్న గ్రూపు– 2 మెయిన్ పరీక్షలకు సీనియర్ జిల్లా అధికారులను సమన్వయ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. పరీక్షల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్‌ను కో–ఆర్డినేటర్‌గా నియమించారు. ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాలకు సమన్వయ అధికారులను నియమించారు. పెదపాడు మండలం వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, పెదపాడు మండలం వట్లూరు సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల సెంటర్‌కు డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఏలూరు సీఆర్‌ఆర్ కళాశాల సెంటర్‌కు డ్వామా పీడీ కె.వి.సుబ్బారావు, పెదపాడు మండలం వట్లూరు సీఆర్‌ఆర్ మహిళా కళాశాల సెంటర్‌కు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా, పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల సెంటర్‌కు సెరీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ డి.వాణి, ఏలూరు జీజీహెచ్‌కు ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల సెంటర్‌కు జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎస్.రామ్మోహన్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment