ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ కమర్షియల్ ట్రాఫిక్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న సుబ్బారావు అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా రూ.187 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్గో లాజిస్టిక్స్ ద్వారా రూ.91 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 22 రీజియన్లలో పశ్చిమగోదావరి జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ పరిసర ప్రాంతాలలోనూ ఆథరైజ్డ్ ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ సెంటర్‌కు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. రూ.1000 రూపాయలతో ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ కౌంటర్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు, సలహాల కోసం 73311 47263, 9959225489, 7382994699 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పీవీవీ గంగాధర్, స్థానిక ఆర్టీసీ కార్గో డీఎంఈ టి.సత్తిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment