కూటమి కుయుక్తులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల బరిలో కూటమి పార్టీ కుయుక్తులకు తెరలేపింది. భవిష్యత్‌లో పథకాలు అందాలంటే ఓటు వేయాల్సిందేనంటూ కార్యకర్తల ద్వా రా ఓటర్లను పరోక్షంగా బెదిరింపులకు పాల్పడు తోంది. మరోవైపు ఓటుకు నోటు లేదా గిఫ్టు ఇస్తామ ంటూ ఓటర్లను ప్రలోభపెడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ఈనెల 25న సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటి బాట పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరుగనుంది. కూటమి పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ నుంచి రిటైర్డ్ టీచర్ దిడ్ల వీరరాఘవులుతో పాటు మరో 33 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.
కూటమిపై తీవ్ర అసంతృప్తి
కూటమి ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారానికి తెరతీశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావడం, ని రుద్యోగ భృతి మొదలు డీఎస్సీ వరకు యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో యువతలో తీవ్ర అసంతృప్తి రేగింది. దీంతో పాటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విపరీతంగా ఎన్నికల హామీలు గుప్పించారు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ ఓటర్లతో పాటు పట్టభద్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుందనే సమాచారంతో టీడీపీ ఎమ్మెల్యేలు విస్తృత స్థాయిలో ప్రచార పర్వం నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం వ్యవహారాన్ని రోజూ రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రచారంలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ప్రతి 30 మంది ఓటర్లకు ఒక టీడీపీ కార్యకర్తను ఏర్పాటు చేసి ఓటర్లను కలిసి వారితో ఫొటో దిగి గ్రూపులో అప్‌లోడ్ చేయిస్తున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులు అసోసియేషన్ల వారీగా ఓటు వేయాలని అభ్యర్థించడంతో పాటు తమదైన శైలిలో హెచ్చరికలు చేస్తున్నారు. పనులు కావాలన్నా, ప్రభుత్వంతో ఏదైనా మాట్లాడాలన్న కూటమి అభ్యర్థిని గెలిపించాలంటూ సచివాలయ ఉద్యోగులను మొదలు టీచర్ల వరకు పరోక్షంగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంకోవైపు అడ్డగోలుగా ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక సమావేశాలు ఏర్పాటుచేసి మరీ ఓట్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు.
ఓటుకు నోటు!
మరోవైపు నియోజకవర్గంలో రోజూ తిరుగుతున్న కార్యకర్తలకు మనిషికి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. ఇలా దెందులూరు మండలంలో 70 మందికి సొమ్ములు అందజేసి ఓట్ల బాధ్యతలను అప్పగించారు. ఇంకోవైపు ఓటుకు నోటు లేదా గిఫ్టు తప్పనిసరిగా ఇస్తామని చెప్పి పూర్తి వివరాలు తీ సుకుని టీడీపీ నేతలే ఎన్నికల అధికారులకు బ దులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఇంకోవైపు ఐవీఆర్ సర్వేలు, అభ్యర్థులను గెలిపించాలంటూ ఫోన్‌కాల్స్‌తో ఓటర్లకు చిర్రెత్తేలా చేయడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారానికి తెరతీశారు.
ఓటర్లకు ప్రలోభాల వల
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల్లను కలిసి టీడీపీ గ్రూపుల్లో ఫొటోలు
ఫోన్ కాల్స్, సర్వేలతో వెంటాడుతున్న వైనం
ప్రతి 30 మంది ఓటర్లకూ ఓ టీడీపీ కార్యకర్త
ఓటుకు నోటు లేదా గిఫ్టు!
25తో ముగియనున్న ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment