ఏలూరు(టూటౌన్): ఈనెల 20న సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచే క్రమంలో కులప్రస్తావన వచ్చిందని, సచివాలయ ఉద్యోగులు మనస్తాపం చెందినట్టు తన దృష్టికి వచ్చిందని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ అన్నారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరినైనా నొప్పించి ఉంటే ప్రశ్చాతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఎంఎస్‌ఎంఈ సర్వేలో జిల్లాలో ఏలూరు దిగువ స్థాయిలో ఉండటంతో ఉద్యోగుల పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పే క్రమంలో పొరపాటున మాటలు దొర్లయాన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగుల సమన్వయంతో ముందుకు వెళతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment