పేదల కాలనీల్లో దళారుల పాగా
ఏలూరు రూరల్: ఇందిరమ్మ కాలనీల్లో దళారులు పాగా వేశారు. ఖాళీ స్థలాలు, అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాలను కబ్జా చేస్తున్నారు. తప్పుడు ఎంజాయిమెంట్స్ సృష్టిస్తూ దందా సాగిస్తున్నారు. అసలైన లబ్ధిదారులకు తెలియకుండా అమాయకులకు వీటిని కట్టబెడుతూ సొమ్ములు చేసుకుంటున్నారు. కాలనీల్లో పెద్ద మనుషులుగా చలామణి సాగిస్తూ పెత్తనం చలాయిస్తున్నాయి.
ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలో కొత్తూరు, మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ, వైఎస్సార్ కాలనీ, కొమడోలు కాలనీల్లో దళారుల దందా సాగుతోంది. కాలనీల్లో మౌలిక వసతులు లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు స్థలాలను వదిలి నగరంలో అద్దెకు ఉంటున్నారు. దీనిని గుర్తించిన కొందరు కాలనీల్లో పెద్ద మనుషులుగా చెప్పుకుంటూ ఖాళీ స్థలాలు, అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాలకు ఎంజాయ్‌మెంట్లు సృష్టించి ఒక్కోటి రూ.1.50 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు చేసిన పేదలు ఇంటి నిర్మాణ పనులు చేపట్టగానే అసలైన లబ్ధిదారులు వచ్చి అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో దళారులు రంగ ప్రవేశం చేసి స్థానికంగా నివాసం ఉండకపోవడంతో అధికారులు పట్టా రద్దు చేసి, కొత్తవారికి ఇచ్చారంటూ లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే పలాయనం చిత్తగిస్తున్నారు. ఇలా కొత్తూరు కాలనీలో ఓ మహిళ ఖాళీ స్థలం కొని ఇంటి నిర్మాణం కోసం పునాది వేసి మధ్యలో వదిలేసింది. మరో వ్యక్తి దళారి మోసగించాడని తెలియడంతో రూ.4 లక్షలతో కొన్న ఇంటిని అలానే వదిలేశారు.
గత ప్రభుత్వంలో చెక్ : గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పట్టాలు పంపిణీ ఆన్‌లైన్ విధానంలో జరగలేదు. ఫలితంగా ఇప్పటికీ దళారుల దందా సాగుతోంది. 2019 వరకు ఈ దందా సాగగా వైఎస్సార్‌సీ ప్రభుత్వ హయాంలో చెక్ పడింది. మాజీ సీఎం జగన్ అర్హులందరికీ 90 రోజుల్లో ఇంటి స్థలం మంజూరు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీంతో దళారులు జగనన్న కాలనీల్లో హవా కొనసాగించలేకపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరడంతో దళారులు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఇందిరమ్మ, వైఎస్సార్ కాలనీల్లో దందా సాగిస్తున్నారు.
ఖాళీ స్థలాల కబ్జా
అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనం
లబ్ధిదారుల్లో గందరగోళం
గొడవలు జరుగుతున్నాయి
కాలనీలో ఇల్లు, ఖాళీ స్థలాల కోసం గొడవలు జరుగుతున్నాయి. ఏ స్థలం ఎవ రిదో తెలియడం లేదు. ఇల్లు కట్టుకుని కొన్నేళ్ల పాటు జీవనం సాగిస్తే గాని ధైర్యం రావడం లేదు. గొడవల వల్ల కాలనీ అభివృద్ధి చెందడం లేదు. ఇళ్లు శిథిలమైపోతున్నాయి. ఖాళీ స్థలాల్లో పొదలు పెరిగిపోతున్నాయి. పాములు, పురుగులు వస్తున్నాయి. వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోతోంది.
– పార్వతి, కాలనీవాసి
లబ్ధిదారులు తెలియడం లేదు
అసలైన లబ్ధిదారుడు ఎవరో తెలియడం లేదు. ఇల్లు లేదా ఖాళీ స్థలం కనిపిస్తే తమదంటూ ఇద్దరు లేక ముగ్గురు వస్తున్నారు. ప్రభుత్వం ఎవరికి స్థలం కేటాయించిందో అర్థం కావడం లేదు. ఎవరైనా ధైర్యం చేసి స్థలం కొని ఇళ్లు కట్టుకుందామంటే భయపడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత స్థలంపై వివాదం నెలకొంటే ఎలా అని సంకోచిస్తున్నారు.
– ప్రసాద్, కాలనీవాసి
పేదల కాలనీల్లో దళారుల పాగా
పేదల కాలనీల్లో దళారుల పాగా
Comments
Please login to add a commentAdd a comment