ఎన్నికల పరిశీలకులుగా శ్రీధర్
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులుగా నియమించిన సీహెచ్ శ్రీధర్ శుక్రవారం ఏలూరు చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు.
సమర్థంగా నిర్వహించాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్ అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డితో చర్చించారు. సమస్యాత్మక కేంద్రాల పరిధిలో నిఘా ఏర్పాటుచేయాలన్నారు. 456 పోలింగ్ కేంద్రాలకు 1,199 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని, 2,714 మంది సిబ్బంది నియమించామని కలెక్టర్ తెలిపారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు
ఎన్నికల నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్ కం ఇంటర్ మీడియేటరీ, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ సెంటర్‌ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు
● కాకినాడ జిల్లా: కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్, పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం
● అల్లూరి సీతారామరాజు జిల్లా: రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీసు, చింతూరు సబ్ కలెక్టర్ కార్యాలయం
● డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం అగ్రహారంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, రామచంద్రాపురం వీఎస్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల, కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్.
● పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ఆర్డీఓ కార్యాలయాలు.
● తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల.
● ఏలూరు జిల్లా: ఏలూరు కలెక్టరేట్ సమీపంలోని గిరిజన భవన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం.
రిసెప్షన్ సెంటర్ కం ఇంటర్ మీడియేటరీ స్ట్రాంగ్ రూమ్‌లు
● కాకినాడ జిల్లా: కాకినాడ కలెక్టరేట్
● అల్లూరి సీతారామరాజు జిల్లా: రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయం
● డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ: అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, రామచంద్రాపురం వీఎస్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల, కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్
● పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం కలెక్టరేట్
● తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల
● ఏలూరు జిల్లా: వట్లూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం
అనంతరం ఆయా జిల్లాల్లో ఇంటర్ మీడియేటరీ స్ట్రాంగ్ రూంలకు చేరిన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని ఏలూరు జిల్లా వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు తరలిస్తారు. మార్చి 3న అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment