నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
తాడేపల్లిగూడెం అర్బన్: నకిలీ నోట్ల ముఠాను తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం డీఎస్పీ డి.విశ్వనాఽథ్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓ మ ద్యం దుకాణం వద్ద నకిలీ రూ.500 నోట్లు మార్చేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో కొందరు నకిలీ నోట్లను మారుస్తున్నట్టు గుర్తించి విచారణ చేపట్టామన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటకి చెందిన పులపాక సాంబశివ నకిలీ నోట్లను తయారుచేస్తున్నట్టు తెలిసిందన్నారు. నకిలీ నోట్లను తయారు చేస్తున్న ఇంటిని సోదా చేసి కంప్యూటర్, రెండు ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సాంబశివతో పాటు మరో 8 మంది ముఠాగా ఏర్పడ్డారన్నారు. వెలగదుర్తి జ్యోతి సాయి (కోనసీమ జిల్లా ఆత్రేయపురం), చింత వరప్రసాద్ (కోనసీమ జిల్లా), ఏలూరి వెంకట సత్యనారాయణ (భీమవరం మండలం రాయలం), పూలపల్లి చినబాబు (తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరం), కాళీ సుబ్బరాజు (దెందులూరు మండలం కొమిరేపల్లి), బొడ్డు శ్రీధర్ (కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి), నల్ల ప్రసాద్ (హనుమాన్‌జంక్షన్), వాసంశెట్టి రఘురాం (కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు) ముఠాగా పలు ప్రాంతాల్లో నోట్లు మారుస్తున్నారని విచారణలో తేలిందన్నారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. సాంబశివ, సుబ్బరాజును ఉంగు టూరులో, శ్రీధర్, రఘురాంను నూజివీడు రోడ్డు లోని ఏపూరులో అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.1,76,000 విలువైన 352 రూ.500 నకిలీ నోట్లు, కంప్యూటర్, రెండు ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సైలు పి.నాగరాజు, బాదం శ్రీను సిబ్బంది కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించారన్నారు.
రూ.1,76,000 విలువైన నకిలీ రూ.500 నోట్ల స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment