కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వ హయాంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కన్ను పడిందంటే చాలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు. ఏలూరు నగర కార్పొరేషన్ పరిధి శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 1వ రోడ్డులో విశాలమైన ప్రభుత్వ పోరంబోకు భూమిపై కబ్జారాయుళ్ల కన్ను పడింది. కొన్నేళ్ల క్రితం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపునీటితో ఈ భూమి చెరువుగా మారింది. క్రమేపీ చెట్లు, పిచ్చిమొక్కలతో డంప్‌యార్డ్‌గా మారింది. ఇక్కడి నుంచి డ్రయినేజీ మురుగునీరు తమ్మిలేరుకు చేరుతోంది. దీని గట్టుపై పేదలు ఇళ్ళు కట్టుకోగా, దిగువ భూమి ఖాళీగా ఉంది. సుమారు 100 మీటర్లు పొడవు, 50 మీటర్ల వెడల్పు కల్గిన స్థలం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. మార్కెట్ విలువ ప్రకారం ఇక్కడ గజం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ పలుకుతోంది. కొద్దినెలల క్రితం మొదట సుమారు 300 అడుగుల స్థలంలో వ్యర్థాలు పోశారు. కొద్దివారాల తర్వాత టిప్పర్లతో కంకర తెచ్చి మెరక చేశారు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చదును చేస్తున్నారు. ప్రజలు అడిగితే ప్రభుత్వం పార్కు కడుతుంది లేదా రైతు బజారు పెడతారంట అంటూ తమ అనుయాయులతో ప్రచారం చేయిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వం చేపట్టిన పనే స్థానికులు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుబజారుకు ప్లాన్
విశాలమైన ఈ స్థలంలో రైతుబజారు ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వ హయాంలో మార్కెట్‌యార్డ్ అధికారులు భావించారు. ఇక్కడ స్థానిక ప్రజల తాగునీటి సరఫరా కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించి, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్‌తో పాటు జిమ్ ఏర్పాటుచేస్తే బాగుంటుందని కార్పొరేషన్ అధికారులు తలచారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల ఆలోచనలు అమలు కాలేదు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జారాయుళ్ల చేతిలోకి వెళ్లిపోయింది.
ప్రణాళిక ప్రకారం స్వాహాకు యత్నం
కబ్జా కోరల్లో ప్రభుత్వ స్థలం
Comments
Please login to add a commentAdd a comment