బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించాలి
ఏలూరు (టూటౌన్): గొర్రెలు, మేకల అభివృద్ధి, పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరుతూ మార్చి 11న గుంటూరు కొత్తపేటలోని గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొట్టేలు పెంటయ్య తెలిపారు. స్థానిక స్ఫూర్తి భవన్‌లో ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 11న గుంటూరులో జరిగే ధర్నా కార్యక్రమం కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు ఏడాదికి నాలుగు సార్లు నట్టల నివారణకు మందులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పించాలని కోరారు. గొర్రెలు, మేకలకు ఉచిత బీమా సౌకర్యం అమలు చేయాలన్నారు. రాష్ట్ర సమితి సభ్యుడు మాగంటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment