మా ఇంటిపై దాడి.. చింతమనేని కుట్ర
బంగారు నగల దోపిడీ
జంగారెడ్డిగూడెంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు దాడి చేసి బంగారు నగలు దోపిడీ చేశారు. దాదాపు 8 కాసులు దోచుకుపోయారు. 8లో u
● చెరువుల లీజు విషయంలో
నాకు సంబంధం లేదు
● మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి
పెదవేగి: తన ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడిని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. తోటలో పామాయిల్ గెలలు కోస్తుండగా, టీడీపీ శ్రేణులు అడ్డుకొని, అక్కడ పనిచేస్తున్నవారిని కొట్టారని, గొడవ జరగకుండా సముదాయించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, ఇందులో పలువురికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. చేపల చెరువుల లీజు విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయం తాను ఎప్పుడో ప్రకటించినా.. అక్కడి గ్రామస్తులను బెదిరించి చింతమనేని కనుసన్నల్లో టీడీపీ నేతలు కొంతకాలంగా తన ఇంటి ముందు అక్రమ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని దుర్మార్గ రాజకీయాలకు ఇది నిదర్శనమని తెలిపారు. రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధను నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టాలని హితవు పలికారు. వైఎసా్‌స్‌ర్‌సీపీ శ్రేణులు దాడులకు భయపడవని, వారికి అండగా ఉంటానని, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment