ఆరుగాలం కష్టించినా అన్నదాతకు సాగులో ఇబ్బందులు తప్పట్లేదు. చివరి దశలోనూ నీటి సమస్యలు వెంటాడుతుండటంతో చేతికందిన పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నాడు. పొలాలకు నీరందించే విషయంలో అధికారుల సమన్వయ లోపం వీరికి శాపంలా మారింది. దెందులూరు మండలం పాలగూడెం శివారు పొలాలు నీటి ఎద్దడితో నెర్రలు తీశాయి. దీంతో కొవ్వలి డ్రెయిన్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడుకుంటూ చేలకు అందిస్తున్నారు. ఎకరాకు అదనంగా రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, మునుపెన్నడూ లేనివిధంగా నీటి కోసం అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
నీటి ఎద్దడి ఆవరించేను
నీటి ఎద్దడి ఆవరించేను