
ధాన్యం కొనుగోలులో సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 2024–25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖలు సమన్వంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లా సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ రబీ పంటకు సంబంధించి 98 శాతం ఈకేవైసీ పూర్తయిందన్నారు. జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని, 2,,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గోనె సంచులను రైస్ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి నిర్దేశించిన గోడౌన్లలో ఉంచాలన్నారు. వాహనాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, ఆర్డీవోలు అచ్యుత్ అంబరీష్, ఎం.వి.రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి.శ్రీలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు .
జేసీ పి.ధాత్రిరెడ్డి