రాజాంతఃపురాలను, కోటలను సినిమాలలో తప్ప స్వయంగా చూడటం సాధ్యం కాదేమో అని బెంగపడే వాళ్లకు ఆహ్వానం పలుకుతోందీ ప్యాలెస్. ఇది మహారాష్ట్రలోని సావంత్‌వాడిప్యాలెస్. గోవాకు దగ్గరలో ఉంది. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈప్యాలెస్‌లోకి అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు సావంత్ రాజవంశీకులు.
యువరాజు లఖమ్ సావంత్ భోంస్లే, యువరాణి శ్రద్ధా సావంత్ భోంస్లేలు తమప్యాలెస్‌ను పర్యాటకులకు హోమ్‌స్టేగా మార్చారు. ‘‘మేము మాప్యాలెస్‌తో వ్యాపారం చేయడం లేదు, మనదేశ చరిత్రను తెలియచేస్తున్నాం. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం ఇక్కడ జరిగింది.
మరో సందర్భంలో నెహ్రూ కూడా బస చేశారు. ఈప్యాలెస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి మా కొంకణ సంప్రదాయ ఆహ్వానం, ఆత్మీయతలు, భోజనంతో పదహారవ శతాబ్దంలోకి వెళ్లి΄ోతారు’’ అని చెబుతున్నారు ఈ ఇంటి వాళ్లు.
టైమ్ మెషీన్‌లో కాలంలో వెనక్కి వెళ్లడం సినిమాల్లో చూడడం కాదు ఇక్కడ స్వయంగా అనుభూతి చెందవచ్చు, అంతేకాదు... మొఘలులు పర్షియా నుంచి మన దేశానికి తీసుకువచ్చిన గంజిఫా ఆట ఆడడం వంటివి ఇక్కడివి వచ్చిన వాళ్లకు నేర్పిస్తామని చెబుతున్నారు.
రాజసాన్ని చూపిస్తుంది. కళాత్మక లాలిత్యంతో కనువిందు చేస్తుంది. అమ్మ ఒడిలా ఆప్యాయతనిస్తుంది. అమ్మమ్మ చేతి స్పర్శలోని మృదుత్వాన్ని గుర్తు చేస్తుంది. పర్యటన రొటీన్‌కి భిన్నంగా ఉండాలని కోరుకునే వాళ్లకు చక్కటి వెకేషన్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment