వివాహంలో వధువు అలంకరణ గొప్పగా ఉండటంతో పాటు వినూత్నంగానూ కనిపించాలనే తపన ఉంటుంది. దాంట్లో భాగంగా పాకిస్తాన్ పెళ్లికూతురు వాజ్మా తన రూపాన్ని మరింత అందంగా, ప్రత్యేకంగా మార్చేసింది. వెడ్డింగ్ ఫోటో షూట్‌లో భాగంగా చేసిన అలంకరణ నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. అందమైన పువ్వులు, లతల ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్ డ్రెస్ ధరించింది. చెవులకు పెద్ద పెద్ద జూకాలు, పాపిట్లో వెడల్పాటి మాంగ్ టిక్కా ఆభరణాల అలంకరణా అంతే గ్రాండ్‌గా ఉంది. వీటితోపాటు మరింత ఆకర్షణీయంగా అమర్చుకున్న కిరీటం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు తీసినా నటాషా జుబైర్ సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక ఫొటోలను షేర్ చేశాడు.
‘నేను పెళ్లికూతుళ్ల ఫొటోలు ఎన్నో తీశాను. వారి డిజైనర్ డ్రెస్‌లు చూశాను. అవన్నీ ఒకేలా ఉండేవి. కానీ, ఈ పెళ్ళి ఫొటోలు ప్రత్యేకమైనవి. దుస్తులు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. పెళ్లికూతురు మెహెందీ వేడుకకు కిరీటంతో సందడి చేసింది. తెలుపు, ఎరుపు గులాబీలతో కురులను అందంగా అలంకరించింది. ఆమె డ్రెస్సింగ్ మొత్తం చైనీస్, ఇండోనేషియా సంస్కృతి నుంచి తీసుకున్నవి. తల ఆభరణాలను మాత్రం కస్టమైజ్ చేసింది’ అంటూ వివరించాడు. ఏ దేశమైనా పెళ్లి అలంకరణలో అందంతో పాటు కొంత వినూత్నత కూడా జత చేరితే ఎల్లలు లేకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment