Cramping Legs And Arms Frequently? Could Be Nerve Damage - Sakshi
Sakshi News home page

కాళ్లూ చేతులూ తిమ్మిర్లు, చేతులు వణుకుతున్నాయా? కారణాలు, పరిష్కారాలు

Published Sat, Oct 1 2022 11:11 AM | Last Updated on Fri, Oct 21 2022 11:36 AM

Cramping Legs And Arms Frequently? Could Be Nerve Damage - Sakshi

కాళ్లూ చేతులు తిమ్మిర్లు రావడం, ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు ఎత్తలేకపోవడం, పట్టేసినట్టుగా ఉండడం, చేతులలో ఒక్కొక్కసారి వణుకు వస్తుంటుంది. ఇది నరాల బలహీనతకు సంకేతం. ఇంతకూ నరాల బలహీనత ఎందుకు వస్తుందో, రాకుండా ఏం చేయాలో చూద్దాం...

⇔ నరాల బలహీనత అనేది ఒత్తిడి కారణంగా, పని మీద శ్రద్ధ లేకపోయినా ఒత్తిడి వల్ల చెయ్యడం వంటి కారణాల వల్ల వస్తుంది. 

⇔ ముఖ్యంగా చెప్పాలంటే నరాలలో రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం, మెదడులోనూ, వెన్నెముకలోనూ రక్త సరఫరా తగ్గిపోవడం, కుంగుబాటు వల్ల్ల నరాల బలహీనత వస్తుంది. 

⇔ వ్యాయామం చేయడం, సరైన పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ఇలాంటివి చెయ్యాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవాలి. 

⇔ అలాగే మాంసాహారం తినని వాళ్ళు పప్పు దినుసులు పనీర్‌ లాంటివి తీసుకోవడం మంచిది. ∙మద్యపానానికి దూరంగా ఉండాలి. 

⇔ ముఖ్యంగా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని కల్పించుకుని  చెయ్యడం అవసరం. ∙6 నుంచి 8 గంటలు నిద్రపోవడం, వ్యాయామం చెయ్యడం. 

⇔ సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన నరాల బలహీనతను మందులు వాడకుండా మొదట్లోనే నివారించుకోవచ్చు. 

⇔ ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అనే సూత్రాన్ని పాటించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. సమస్య శ్రుతి మించుతున్నట్లు అనిపిస్తే వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement