పంది అనగానే.. కొంతమంది దాని రూపం చూసి అసహ్యించుకుంటే, మరి కొంతమంది దేవుని వరాహావతారంగా భావించి గౌరవిస్తుంటారు. కానీ, ఇంగ్లండ్‌కు చెందిన జూలియా బ్లేజర్ మాత్రం వాటిని డాక్టర్లుగా భావిస్తుంది. తన పెంపుడు పందులైన ‘హాజెల్’, ‘హోలీ’లే ఆమె అధీనంలోని డాక్టర్లు. అంతేకాదు, 2015లో ‘గుడ్ డే అవుట్’ పేరుతో యూనెస్కోలోని బ్రీకాన్స్ నేషనల్ పార్క్‌లో చికిత్స కేంద్రాన్ని కూడా నిర్మించింది. ఇక్కడే రోజూ హాజెల్, హోలీ అనే ఈ రెండు వరాహాలు మనుషులకు చికిత్స అందిస్తుంటాయి.
నిజం, జూలియాకు ఒకప్పుడు ఊపిరి ఆడనంతగా ఒత్తిడి.. ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు ఈ రెండు పందులే ఆమెకు ఊరటనిచ్చాయి. కోల్పోయిన తన ప్రశాంతతను తిరిగి తీసుకొచ్చాయి. రోజూ వాటితో వాకింగ్ చేస్తే, తన మనసు కుదుట పడేదట! వరాహాలతో తాను పొందిన ప్రయోజనాన్ని గుర్తించిన వెంటనే, తనలాగే బాధపడే వారికి ‘పిగ్ వాకింగ్ థెరపీ’ పేరుతో చికిత్స అందించాలని నిర్ణయించుకుంది. అలా ఇప్పటి వరకు ఎంతోమంది ఈ రెండు పందులతో షికారుకెళ్లి ఆనందం, ఆరోగ్యం పొందుతున్నారు. ఇక్కడ కేవలం పందులే కాదు, గాడిదలు, గుర్రాలు కూడా వైద్యం అందిస్తున్నాయి. ఒక్కో రకం చిక్సితకు గంటకు రూ. 4 వేల నుంచి రూ. 14 వేల వరకు తీసుకుంటారు. మీకు కూడా ఈ వైద్యం కావాలంటే మరో ఆరునెలలు వేచి చూడాల్సిందే. ఇప్పటికే, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న స్లాట్లన్నీ బుక్ అయిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment