
క్లాత్ లేదా వుడ్ పైన పెయింట్ చేసి, హుక్స్ పెట్టేసి చెవులకు హ్యాంగ్ చేస్తే ఏ ఆభరణాలూ సరిపోవు అనిపిస్తుంది. పెయింటింగ్ ఫ్రేమ్స్ గోడ మీద ఉంటాయి కానీ, చెవులకు ఎలా... అనుకుంటున్నవారికి ఇలాంటి ఇయర్ హ్యాంగింగ్స్ ఒక కొత్త వేదిక అవుతుంది.
ఇయర్ రింగ్స్‌గా పెయింటింగ్ వేసి ఉన్న హ్యాంగింగ్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ప్లెయిన్ డ్రెస్‌ను సైతం అట్రాక్టివ్‌గా మార్చేసే ఈ ఆభరణాలు క్యాజువల్‌గానూ, పార్టీవేర్‌గానూ అందంగా మెరిసిపోతున్నాయి. ఫ్యాషన్ జ్యువెలరీలో భాగంగా పెయింటింగ్ జ్యువెలరీ తన అందాన్ని చాటుతూ చూపరులను అబ్బురపరుస్తుంది.
వెస్ట్రన్ లేదా మన సంప్రదాయ దుస్తులకూ చక్కగా నప్పుతుంది. సృజనకలవారు వీటిని స్వయంగా తయారుచేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ వేదికగా రూ.300 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
∙పల్లె పడుచుల రూపాలను, వారు చేస్తున్న పనులను కూడా పెయింటింగ్ ద్వారా చిత్రించవచ్చు. ఈ చిత్రకళారూపాలు ఏ ప్లెయిన్ డ్రెస్‌మీదకైనా ముచ్చటగొలుపుతాయి.
∙ప్రకృతి అందాలకు నెలవైన సెలయేటి గలగలలు, బీచ్‌లు, వనాలను రంగులతో తీర్చిదిద్దడానికి, వాటి అందాన్ని చూపరులు మెచ్చడానికి ఓ మంచి అవకాశంగా మారింది.
∙బుద్ధుని రూపాలతో పాటు దుర్గ, శక్తి రూపాలను ఇయర్ హ్యాంగింగ్స్‌గా చూడచ్చు. అంతేకాదు, సంస్కృత శ్లోకాలు, మంత్రాక్షరాలూ కూడా ఈ హ్యాంగింగ్స్‌లో అందంగా అమరిపోతున్నాయి.
చదవండి: Shraddha Srinath: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ?
Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!
Comments
Please login to add a commentAdd a comment