ప్రతీకాత్మక చిత్రం
ఫిట్స్ వచ్చినప్పుడు నోటి నుంచి నురుగ రావడాన్ని గమనించవచ్చు. చూసేవారికిది చాలా భయాన్ని గొలుపుతుంది కూడా. నిజానికి ఇది చాలా నిరపాయకరమైన లక్షణం. ఫిట్స్ వచ్చినప్పుడు నురగ ఎందుకు వస్తుందో చూద్దాం. ఫిట్స్ వచ్చినప్పుడు మింగడం ప్రక్రియ ఆగిపోతుంది. కానీ నోట్లో ఊరే లాలాజలం మాత్రం యథావిధిగా ఊరుతూనే ఉంటుంది. సాధారణంగా నోట్లో ఊరే ఈ లాలాజలం నిత్యం గుటక వేయడం వల్ల కడుపులోకి వెళ్తుంది. మనకు తెలియకుండానే మనం ఇలా ఎప్పటికప్పుడు గుటక వేస్తూనే ఉంటాం.
అయితే ఫిట్స్ వచ్చినవారిలో గుటక వేయనందున ఆ లాలాజలం నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల్లోంచి వచ్చే గాలి ఈ లాలాజలంలో బుడగలను సృష్టిస్తుంది. అందుకే ఫిట్స్ వచ్చినప్పుడు ఈ బుడగలతో కూడిన లాలాజలం కారణంగా... నోట్లోంచి నురగ వస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ముందు చెప్పినట్లుగా ఇదేమీ ప్రమాదకరమైన లక్షణం కాదు. అంతేకాదు... దీన్ని ఫిట్స్ తీవ్రతకు లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఆ నురగను చూసి ఆందోళన చెందకుండా రోగిని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలి.
చదవండి: తెమడ రంగును బట్టి జబ్బును ఊహించవచ్చు!
పుట్టుమచ్చలా... ఈ ‘ఏ, బీ, సీ, డీ’లు గుర్తుంచుకోండి!
Comments
Please login to add a commentAdd a comment