వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర  | Ganpati Visarjan 2024: Devotees immerse Ganpati idols as festival concludes | Sakshi
Sakshi News home page

వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర 

Published Thu, Sep 19 2024 3:07 PM | Last Updated on Thu, Sep 19 2024 3:07 PM

Ganpati Visarjan 2024: Devotees immerse Ganpati idols as festival concludes

19 గంటల పాటు సాగిన లాల్‌ బాగ్‌ చా రాజా శోభాయాత్ర 

బీఎంసీ పరిధిలోఓ 204 కృత్రిమ  నిమజ్జన ఘాట్ల ఏర్పాటు 

ముంబైలో మొత్తం 37,064  వినాయకుల నిమజ్జనం 

ఇసుక వేస్తే రాలనంతగా జనం.. అడుగడుగునా నీరాజనాలు 

గణపతి బొప్పా మోర్యా.. 

పుడ్చా వర్షీ లౌకర్యా నినాదాలతో మార్మోగిన పరిసరాలు

సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడికి శాంతియుతంగా వీడ్కోలు పలికారు.  గణేశోత్సవాలతోపాటు నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ‘గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా’ (గణపతి దేవుడా వచ్చే సంవత్సరం తొందరగా రావయ్య), ‘గణపతి గేల గావాల చైన్‌ పడేన హమాల’ అనే నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో 10 రోజులపాటు పూజలందుకున్న వినాయకుడి ప్రతిమలను భారీ ఎత్తున శోభాయాత్రల ద్వారా ఊరేగించి నిమజ్జనం చేశారు. 

భారీ భద్రత మధ్య మంగళవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు పలు ప్రాంతాల్లో బుధవారం వరకు కొనసాగాయి.  ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 69 కృత్రిమ నిమజ్జన ఘాట్లతోపాటు 204 కృత్రిమ నిమజ్జన ఘాట్ల వద్ద మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ముంబైలో మొత్తం 37,064 వినాయకుల నిమజ్జనం జరిగాయి. వీటిలో 5,762 విగ్రహాలు సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 31,105 ఇళ్లల్లో ప్రతిష్టించిన వినాయకులతోపాటు 197 గౌరీలను నిమజ్జనం చేశారు. కృత్రిమ జలాశయాల్లో 709 సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 10,957 ఇళ్లల్లోని వినాయకులు, గౌరీలు ఇలా మొత్తం 11,713 విగ్రహాలున్నాయి.  ముంబైలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ముంబై రాజాగా గుర్తింపు పొందిన గణేశ్‌ గల్లీలోని ముంబైచా రాజా వినాయకుడి నిమజ్జన యాత్ర మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటలకు ప్రారంభమైంది. ఈ శోభాయాత్రతో ముంబై నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అనంతరం ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కోరికలు తీర్చేదైవంగా గుర్తింపు పొందిన లాల్‌బాగ్‌చా రాజా వినాయకుని హారతి 10.30 గంటల ప్రాంతంలో జరిగింది. అనంతరం లాల్‌బాగ్‌ చా రాజా వినాయకుని శోభాయాత్ర సుమారు 11 గంటలకు  ప్రారంభమైంది. 

ఇలా ప్రారంభమైన నిమజ్జనోత్సవాలలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ముంబైలోని గిర్‌గావ్, శివాజీ పార్క్, జుహూ, చౌపాటీ తదితర నిమజ్జన ఘాట్ల వద్దకి లక్షలాది మంది భక్తులు వినాయకుడిని సాగనంపారు. ప్రతి సారి మాదిరిగానే ఈ సారి నిమజ్జనోత్సవాలు కూడా నిఘా నీడలో జరిగాయి.    

నిమజ్జనాల ఊరేగింపులు ఎంత తక్కువైతే అంత తక్కువ సమయంలో పూర్తి చేయాలని పోలీసులు సార్వజనిక గణేశోత్సవ మండళ్లకు సూచనలిచి్చనప్పటికీ నగరంలో సగటున 5 నుంచి 10 గంటలపాటు నిమజ్జనాల ఊరేగింపులు కొనసా గాయి. నగరంలోని ప్రముఖ వినాయకులలో ఒకటైన లాల్‌బాగ్‌ చా రాజా వినాయకుడి నిమజ్జన ఊరేగింపు సుమారు 19 గంటలపాటు కొనసాగింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. లాల్‌బాగ్‌ నుంచి గిర్‌గావ్‌ చౌపాటీ వరకు జనం నీరాజనాలు పలికారు. ఇసుకవేస్తే రాలనంత జనం మధ్య ఈ నిమజ్జనోత్సవాల శోభాయాత్ర కొనసాగింది. గణపతి బొప్పా మోర్యా.. గణపతి చాల్‌ లా గావాలా.. చైన్‌ పడేనా అమ్హాలా.. అనే నినాదాలతో పరిసరాలు హోరే త్తాయి. భక్తిమయ వాతవరణం మధ్య నిమజ్జన యాత్ర కొనసాగింది. ముఖ్యంగా చిన్న పెద్ద ఆడామగ వయసుతో తేడా లేకుండా అందరూ బ్యాండుమేళాలు సంగీతానుసారం నృత్యం చేస్తూ వీడ్కోలు పలికారు. ఇలా బుధవారం ఉదయం లాల్‌బాగ్‌చా రాజా వినాయకుడిని గిర్‌గావ్‌ చౌపాటీలో నిమజ్జనం చేశారు. మరోవైపు పక్కనే ఉన్న థానే, నవీ ముంబైలలో నిమజ్జనాల ఊరేగింపులు కూడా సగటున 3 నుంచి 5 గంటలపాటు సాగాయి. ముంబై పోలీసులకు మద్దతుగా హోంగార్డులు, అగి్నమాపక సిబ్బంది, ఎస్‌ఆర్‌పీఎస్, ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బందిని మోహరించారు. 

అలాగే ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా ముందుజాగ్రత్తగా పలు రోడ్లు బంద్‌ చేయడంతోపాటు వన్‌వే ల కారణంగా అంతగా సమస్య ఏర్పడలేదని చెప్పవచ్చు. అయితే నిమజ్జనాల ఘాట్లవైపు వెళ్లే రోడ్లుపై మాత్రం తీవ్ర ట్రాఫిక్‌ సమస్య కని్పంచింది. మరోవైపు కృత్రిమ జలాశయాల్లో కూడా భారీ ఎత్తున నిమజ్జనాలు జరగడం పర్యావరణ ప్రేమికులకు ఆనందం కలిగించింది. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు బీఎంసీ చేస్తున్న ప్రయత్నం పెద్ద ఎత్తున సఫలీకృతమైందని చెప్పవచ్చు.  పుణేలో ఎప్పటిలాగానే రెండవరోజు బుధవారం మ« ద్యాహ్నం వరకు నిమజ్జనాలు జరిగాయి. అయితే ఈసారి నిమజ్జనోత్సవాలు 29 గంటలకుపైగా సమయం పట్టడం విశేషం. నగరంలో గణేశోత్సవాలకే గౌర వంగా భావించే మొదటి గణపతి ‘కస్బా పేట్‌’ వినాయకుడితోపాటు అయిదు గణపతు ల శోభాయాత్రలు ముందు గా ప్రారంభమయ్యాయి. పుణేలో ముఖ్యంగా కళ్లు మిరుమి ట్లు గొలిపే విద్యుత్‌ దీపాలంకరణలతోపాటు సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనోత్సవాల శోభాయాత్రలు జరిగాయి. ఈ శోభాయాత్రల ను లక్షలాది మంది తిలకించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement