కరోనా మహమ్మారి.. ఆరోగ్య బీమా తీరు మారి... | Health Insurance Demand Increases After Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా మహమ్మారి.. ఆరోగ్య బీమా తీరు మారి...

Published Fri, Feb 26 2021 3:16 PM | Last Updated on Fri, Feb 26 2021 3:48 PM

Health Insurance Demand Increases After Coronavirus - Sakshi

ఒకప్పుడు ఆరోగ్య బీమా అనేది ముందున్న వ్యాధులకు, అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అందడం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.కోవిడ్‌ 19 తర్వాత ఆరోగ్య బీమాకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. కరోనా చికిత్సకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.10, 20లక్షల వరకూ వ్యయాన్ని భరించాల్సి రావడం ఆరోగ్య బీమా అవసరాల్ని మరింత ఎక్కువగా గుర్తు చేసింది. దీంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండడం తప్పనిసరిగా భావిస్తున్నారు.
విప్లవాత్మక మార్పులు...

ఈ క్రమంలోనే ఐఆర్‌డీఎ, బీమా సంస్థలు విప్లవాత్మక పరిష్కారాలు చేపట్టాయి. దీంతో బీమా కంపెనీలు అందించే పాలసీ నియమ నిబంధనల్లో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలును మరింత సులభతరం చేస్తున్నాయి. చాలా వరకూ డిజిటల్‌ అండర్‌ రైటింగ్‌ ప్రాసెస్‌లోనే పాలసీలు అందిస్తున్నారు. దీని వల్ల అరుదైన పరిస్థితుల్లో తప్ప బీమా కావాల్సిన వారు శారీరక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం తగ్గుముఖం పట్టింది. అలాగే డిసీజ్‌ మేనేజ్‌మెంట్‌ బెనిఫిట్‌ వంటివి కూడా అందించే పాలసీలు అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా అప్పటికే ఉన్న అనారోగ్యాలకు సంబంధించి కేవలం 2 నుంచి 4ఏళ్ల లోపునకు మాత్రమే వెయిటింగ్‌ పీరియడ్‌ని పరిమితం చేస్తున్నారు.

పాలసీ తీసుకున్న కొన్ని నెలల్లోనే క్లెయిమ్‌ చేసుకోవాలనుకునేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటోంది. కొన్ని రకాల పాలసీల్లో పాత అనారోగ్యాలున్నా పాలసీ తీసుకున్న  రోజు నుంచే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇది చాలా విప్లవాత్మక పరిణామంగానే చెప్పొచ్చు. గతానికి భిన్నంగా ఇప్పుడు 20ఏళ్ల నుంచి హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న రోగికి కూడా పాలసీ ఇస్తున్నారు. అలాగే కేన్సర్, కిడ్నీ, హృద్రోగాలు, శ్వాస కోస వ్యాధులు వంటివి ఉన్నవారు కూడా ఆరోగ్య బీమా పొందగలుగుతున్నారు.  

సూచనలు:
 పాలసీ తీసుకోవడానికి పూర్వమే  ఉన్న అనారోగ్యాలను గురించి దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా తెలియజేయడం అవసరం. వీటిని దాయడం వల్ల నష్టమే ఎక్కువ. అనారోగ్యం ఉందనే కారణం కన్నా, తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంతో క్లెయిమ్‌ని తిరస్కరించడం సులభం అని గుర్తించాలి. 

  • మన కుటుంబ సభ్యుల వయసు, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సమ్‌ అస్యూర్డ్‌ నిర్ణయించుకోవాలి. 
  • దీర్ఘకాలిక అనారోగ్యాలకు, ప్రాణాంతక వ్యాధులకు అతి తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న పాలసీలనే ఎంచుకోవాలి. 
  • జీరో కో పేమెంట్, విభిన్న రకాల ఆరోగ్య పరిస్థితులకు పలు రకాల ట్రీట్‌మెంట్స్‌కి సబ్‌ లిమిట్స్, రూమ్‌ రెంట్‌..వంటివి అందించే ప్లాన్స్‌ను పరిశీలించాలి. 

ఆరోగ్య బీమాపై ఆసక్తి పెరిగింది...
ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో ఆరోగ్య బీమాపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరిగింది. అదే సమయంలో బీమా సంస్థలు కూడా చాలా వరకూ తమ నిబంధనల్ని సడలించి, బీమా కొనుగోలును సులభతరం చేశాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన, అవసరమైన బీమా పాలసీని తీసుకుంటే మన ఆదాయంలో నుంచి ఆరోగ్య చికిత్సల వ్యయం పూర్తిగా తగ్గించుకోవచ్చు. 
అమిత్‌ చాబ్రా, హెల్త్‌ బిజినెస్‌ హెడ్, పాలసీ బజార్‌ డాట్‌కామ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement