సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేట్ ఆసు పత్రుల విన్నపాన్ని సర్కారు మన్నించింది. సర్కారు నిర్దేశిం చిన ప్యాకేజీ కేవలం నగదు చెల్లించే వారికేనని, బీమా సంస్థ లకు వర్తించదని స్పష్టత ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రైవేట్, కార్పొ రేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజ మాన్యాలు తెలి పాయి. ప్రభుత్వం ఇటీవల ప్రకటిం చిన ప్రైవేట్ కరోనా వైద్య ఫీజుల ప్యాకేజీ ఉత్తర్వుల్లో బీమా కంపెనీల ప్రస్తావన లేదు. కేవలం ఎంత ఫీజు వసూలు చేయాలన్న అంశమే ఉంది. అయితే ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న కరోనా బాధితులు వాటి ప్రకారం చికిత్స చేయా లని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తుండటం, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సర్కారు ప్యాకేజీ ప్రకారమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేయడంతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసు పత్రులు ఇరకాటంలో పడ్డాయి.
ప్రైవేట్ బీమా పాలసీ ఉన్నప్పటికీ కరోనా రోగుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ విష యం వివాదాస్పదం కావ డం, రోగుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండ టంతో కార్పొరేట్ ఆసుపత్రులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలకు సర్కారు ప్యాకేజీతో సంబంధం లేదన్నట్లుగా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయా ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్యాకేజీ ఉత్తర్వుల సవరణ కేవలం నగదు చెల్లించే సాధా రణ వార్డుల్లోని రోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీ ఉన్న రోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు.
ప్రైవేట్‌లో సాధారణ బీమా కవరేజీ కింద కరోనా చికిత్స...
కరోనా రోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు తిరస్కరించాయి. కొన్ని ఆసుపత్రులు బీమా నుంచి వచ్చిన సొమ్ము పోను మిగిలిన సొమ్మును రోగుల నుంచి వసూలు చేశాయి. ఇటీవల ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి చికిత్స కోసం రూ. 4.20 లక్షల బిల్లు వేశారు. ప్రైవేటు బీమాను అనుమతించినా ఆ సంస్థ ప్యాకేజీ ప్రకారం రోగికి రూ. 1.23 లక్షలు మాత్రమే బిల్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును రోగి చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేసింది. తాజా ఉత్తర్వులో ఇచ్చిన స్పష్టతతో నిర్దేశించిన పాలసీ ప్రకారం పూర్తి సొమ్ము బీమా కంపెనీల నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు బీమా కంపెనీలతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు గతంలో వివిధ వ్యాధులకు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఫీజులు వసూలు చేసుకోవచ్చు.
ఇది ప్రైవేట్ బీమా పాలసీ ఉన్న బాధితులకు, ఆసుపత్రులకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ప్రైవేట్ బీమా పాలసీ లేని కరోనా రోగులు మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు నగదు చెల్లించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి బాధితులకు ఆరోగ్యశ్రీ లేదా ఉద్యోగుల బీమా పాలసీలను అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై గుర్రుగా ఉంది. అత్యవసర సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకొనేది లేదని స్పష్టం చేసింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించే సర్వాధికారాలున్నాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ప్రైవేట్ బీమా పాలసీ లేనివారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
సర్కారు స్పష్టత ఇచ్చింది
మా విన్నపాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది. గతంలో ఇచ్చిన జీవోలో కరోనా ఫీజు ప్యాకేజీ వివరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ బీమా కంపెనీలు కూడా దాని ప్రకారమే కరోనా బిల్లుల సొమ్ము చెల్లిస్తామని చెప్పాయి. వాస్తవానికి సర్కారు ప్రకటించిన ఫీజు మాకు ఏమాత్రం సరిపోని పరిస్థితి ఉంది. గతంలో ప్రైవేట్ బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య వివిధ వ్యాధులకు ఎంవోయూ ఉంది. దాని ప్రకారం కాకుండా సర్కారు ప్యాకేజీతో ఇబ్బంది ఏర్పడింది. అయితే సర్కారు ఇప్పుడు ప్యాకేజీతో బీమా కంపెనీలకు సంబంధం లేదని చెప్పడం వల్ల గతంలో మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం బీమా కంపెనీలు వ్యాధులను బట్టి బిల్లు సొమ్ము ఇస్తాయి. దీనివల్ల ఎవరికీ నష్టం ఉండదు. రోగులపైనా ఆర్థిక భారం ఉండదు. – భాస్కర్‌రావు, తెలంగాణ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు, కిమ్స్ ఆసుపత్రుల అధినేత
Comments
Please login to add a commentAdd a comment