Health Benefits Of Betel Leaves In Telugu: చాలా మందికి భోజనం చేసిన తర్వాత తమలపాకులు తినే అలవాటు ఉంటుంది. ఇది మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రెండు తమలపాకులు నమలితే చాలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో సుగుణాలు తమలపాకుల్లో చాలా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందామా?!
►దగ్గు, ఆయాసంతో బాధపడతున్న పిల్లలకు... తమలపాకులను ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి చాతీపై రుద్దాలి. ఇలా చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది.
►తమలపాకు రసాన్ని గొంతు భాగంలో రుద్దితే గొంతు మంట, ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే తగ్గుతుంది.
►గాయాలు వేధిస్తున్నట్లయితే తమలపాకులను నూరి, ఆ రసాన్ని వాటిపై రాస్తే త్వరగా మానిపోతాయి.
►వెన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్లు... కొబ్బరినూనెలో తమలపాకుల రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
►ఇక చెవి పోటుతో కలిగే బాధ వర్ణనాతీతం. కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు.
►అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది.
►ఆర్థరైటిస్ వల్ల కీళ్ల భాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
►కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు.
►విటమిన్ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.
► కాన్సర్ నిరోధక కారకంగానూ తమలపాకు పనిచేస్తుంది.
చదవండి: Viral Video: ఇదేదో కొత్తగా ఉందే.. మట్టిలో టమాటాలను వేయించి.. ఆపై
Mustard Oil For Weight Loss: బరువు తగ్గాలా.. పెదాలు మృదువుగా మారాలా.. ఈ ఆయిల్ ట్రై చేయండి!
Comments
Please login to add a commentAdd a comment