వర్షాకాలంలో ఆస్తమా సమస్యా? ఎలా కంట్రోల్‌ చేయాలి? | Home Remedies To Control Asthma With Ayurvedic Tips | Sakshi
Sakshi News home page

Ayurvedic Tips To Control Asthma : వర్షాకాలంలో ఆస్తమా సమస్యా? ఎలా కంట్రోల్‌ చేయాలి?

Published Thu, Sep 7 2023 4:23 PM | Last Updated on Thu, Sep 7 2023 4:55 PM

Home Remedies To Control Asthma With Ayurvedic Tips - Sakshi

వర్షకాలంలో చాలామందిని వేధించే సమస్య ఆస్తమా. వాతావరణంలో మార్పులతో శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉబ్బసం అటాక్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మారుతున్న సీజన్‌లో ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతారు. లక్షణాలను సకాలంలో గుర్తిస్తే ఆస్తమాను నివారించుకోవచ్చు. ఆస్తమా వ్యాధిని ఎలా అదుపులో పెట్టుకోవాలన్నది ప్రముఖ ఆయుర్వేద డా. నవీన్‌ నడిమింటి మాటల్లోనే విందాం.

ఇలా చేస్తే దగ్గు, జలుబు ఈజీగా తగ్గుతుంది
చిటికెడు పసుపును నీళ్ళలో వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి పదిసార్లు పట్టాలి. పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగి, ముక్కు, ముఖానికి విక్స్ వేపరబ్ పట్టించి దుప్పటి తలమీద వరకు కప్పుకుని పడుకుంటే ఉదయం లేవగానే ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది.తులసి ఆకుల రసం తేనె తో కలిపి తీసుకుంటే  జలుబూ గొంతు నొప్పి,దగ్గు త్వరగా తగ్గుతాయి.

జలుబు లేకపోయినా పొడి దగ్గు.. ఎందుకు? 
 శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు వస్తుంది.ఇలా వచ్చే దగ్గు వెంటనే తగ్గదు..కానీ ఉప్పునీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం, మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు), లేదా వెచ్చటి తేనె, నిమ్మరసం కలిపిన నీరు లాంటివి కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఇక దాహం వేసినప్పుడల్లా అశ్రద్ద చేయకుండా శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. 

ఉబ్బసం వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఎలా…?
కొన్ని ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా ఉబ్బసం వ్యాధిని అదుపులో ఉంచుకోవ‌చ్చు.విట‌మిన్ సీ, ఈ,బెటాకెరోటిన్‌,ఫ్లేవ‌నాయిడ్స్‌,మెగ్నీషియం,సెలీనియం,ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ల‌భించే ఆహారాల‌ను తీసుకోవ‌డం ద్వారా ఉబ్బసం వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.కోడిగుడ్లు, పాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటు పాలకూర వంటి ఆకుకూరలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. 

హోమియోలో Blatta orientalis అనే మందు ఉబ్బసం వ్యాధి నివారణ లో అద్భుతంగా పని చేస్తుంది. దీన్ని Mother Tincture రూపంలో రోజు 3 పర్యాయాలు అర గ్లాసు (చిన్న గ్లాసు) నీటిలో 10 చుక్కల వంతున వేసి ఇవ్వాలి.

-డా.నవీన్‌ నడిమింటి(9703706660)
ప్రముఖ ఆయుర్వేదిక్‌ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement