మొక్కలకు, చెట్లకు అనుభూతులు ఉంటాయి. వాటిలో అవి సంభాషణలు జరుపుకుంటాయి అని శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్నారు. మొక్కలు సంగీతాన్ని కూడా ఆలపిస్తాయి. అయితే వాటి సంగీతం మన చెవులకు సోకదు. మొక్కల సంగీతాన్ని వినగలిగే పరికరాల తయారీ దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా కృషి సాగిస్తున్నారు. అందులో భాగంగానే స్వీడన్‌కు చెందిన వడ్రంగి, సంగీత పరికరాల తయారీదారుడు అయిన లవ్ హల్టన్ మొక్కల సంగీతాన్ని వినగలిగేందుకు వీలుగా ఈ పరికరాన్ని రూపొందించాడు.
దీనికి ‘టెగెల్’ అని పేరు పెట్టాడు. చూడటానికి ఇది ఇటుకలతో తయారు చేసినట్లు కనిపిస్తున్నా, పూర్తిగా కలపతోనే తయారైంది. ఇందులోని మట్టి కుండీలో మొక్కను నాటి, దాని నుంచి వెలువడే ధ్వని తరంగాలను స్వీకరించేలా విద్యుత్తు తీగలను అమర్చాడు. దీనిలోని స్పీకర్ అమరిక ద్వారా మొక్కల నుంచి వెలువడే సంగీతం మనకు కూడా వినిపిస్తుంది. అలాగే దీనికి అమర్చిన కీబోర్డును వాయిస్తూ మనుషులు కూడా సంగీతాన్ని సృష్టించవచ్చు. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ పరికరాన్ని మార్కెట్‌లోకి తేలేదు.
(చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!)
Comments
Please login to add a commentAdd a comment