‘ఘన విజయాలు మన తలరాతలో ఉండవు, మన చేతలతో ముడిపడి ఉంటాయి’ అనే మాటను నమ్మిన వాళ్లలో ఈ నలుగురు యువకులు కూడా ఉన్నారు. ‘నలుగురు కూడితే... కష్టం, సుఖం’ అంటారు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ‘గ్రో’ విజయం ద్వారా ఆ వరుసలో ఘనవిజయాన్ని కూడా చేర్చారు ఈ నలుగురు...
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అఖిలకు ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆసక్తి మొదలైంది. మ్యూచ్‌వల్ ఫండ్స్‌పై దృష్టి పెట్టింది. అయితే ఆమెను రెండు విషయాలు అయోమయంలోకి నెట్టాయి.
ఒకటి: తమ కంపెనీ గురించి గొప్పగా చెప్పుకునే వ్యాపార ప్రకటనలు.
రెండు: ఆ ప్రకటనలు ముగిసేలోపే ‘మ్యూచ్‌వల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ రిస్క్. ప్లీజ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్‌ఫుల్లీ’ అనే డిస్‌క్లైమర్ వాయిస్.
ఈ మొత్తం వ్యవహారంలో ఆమెకు ‘రిస్క్’ అనే మాట తప్ప ఏమీ వినిపించలేదు. దీంతో వెనక్కి తగ్గింది. ఇది చెన్నైకి చెందిన అఖిల పరిస్థితి మాత్రమే కాదు. దేశంలోని ఎన్నో ప్రాంతాలకు చెందిన ఎంతోమంది పరిస్థితి.
...................
ఐఐటి, బాంబేలో చదువుకున్న లలిత్ కేశ్ర్, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్ ‘గ్రో’ అనే పేరుతో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టారు. మనదేశం విషయానికి వస్తే తక్కువ మంది మాత్రమే స్టాక్స్, మ్యూచువల్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
దీనికి కారణం పెట్టుబడి ప్రక్రియలో ఎదురయ్యే సందేహాలు, అయోమయాలు. ఇలాంటి సమయంలో... ఇన్వెస్ట్‌మెంట్ ఈజీ, ఫాస్ట్, ట్రాన్స్‌పరెంట్ నినాదంతో రంగంలోకి దిగింది గ్రో.
‘గందరగోళాన్ని తొలగించి సులువైన దారి చూపించాం’ అంటున్నాడు ‘గ్రో’ కో–ఫౌండర్, సీయివో లలిత్ కేశ్ర్. diy జనరేషన్(డూ ఇట్ యువర్ సెల్ఫ్)ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది గ్రో.
మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్‌ఫామ్‌గా మొదలైన ‘గ్రో’ స్టాక్స్, గోల్డ్, ఎన్‌ఎఫ్‌వో... మొదలైన విస్తృత ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లను ఆఫర్ చేస్తుంది. ‘గ్రో’కు లక్షల సంఖ్యలో వివిధ నగరాల్లో రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. యూనికార్న్ క్లబ్‌లో చేరడం ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ‘గ్రో’
ఇంతకీ ‘గ్రో’ విజయరహస్యం ఏమిటి?
మిడిల్‌క్లాస్ ఇన్‌కమ్ సెగ్మెంట్ బలపడడం, సరిౖయెన సమయంలో ఆ సెగ్మెంట్‌కు చేరువ కావడం, నెక్ట్స్ జెనరేషన్ వెల్త్ క్రియేటర్స్‌గా భావించే యువతను తమవైపు ఆకట్టుకోవడం, జీరో ఎకౌంట్ చార్జెస్... మొదలైన కారణాలు చెప్పవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్ హై కమిషన్, ఆఫ్‌లైన్ ఏజెంట్ డ్రైవెన్ మోడల్... మొదలైన వాటికి దూరంగా ఉంది. ‘గందరగోళం లేకుండా... సులభమైన రీతిలో’ అనే పద్ధతిని అనుసరించింది గ్రో. భౌతిక ఆస్తులు ఆన్‌లైన్ ఆస్తులుగా మార్పిడి అయ్యే టైమ్ ప్రస్తుతం మన దేశంలో నడుస్తుంది. కాల అనుకూలత కూడా ‘గ్రో’ విజయానికి కారణం.
‘గ్రో’ విజయంలో కీలక పాత్ర పోషించిన కో–ఫౌండర్, సీయివో లలిత్ కేశ్ర్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ప్రతిరోజూ పడుకునే ముందు గంట, ఆదివారం మూడు గంటల సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తాడు. కాల్పనిక పుస్తకాల కంటే కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్‌ల గురించి తెలుసుకునే పుస్తకాలు ఎక్కువగా చదువుతాడు. తనకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి సుచేత దలాల్ ...అబ్‌సొల్యూట్లీ పవర్.
ఈ పుస్తకం ద్వారా 1990 తరువాత తనకు తెలియని స్టాక్‌మార్కెట్ విషయాల గురించి తెలుసుకోగలిగాడు. పుస్తకం చదివినా, ఏదైనా మీటింగ్‌కు హాజరైనా నోట్స్ రాసుకోవడం లలిత్ అలవాటు.
‘కొత్తతరం ఇన్వెస్టర్‌లకు మీరు ఇచ్చే సూచన ఏమిటి?’ అనే ప్రశ్నకు ఇలా జవాబు చెబుతాడు లలిత్... ‘అరకొర సమాచారంతో, అవగాహన లేని ప్రాడక్ట్‌పై ఇన్వెస్ట్ చేయవద్దు, చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడూ మంచిదే’
‘గ్రో’ అమోఘ విజయం రెండు విషయాలలో యువతకు మేలు చేస్తుంది. ఒకటి... స్టార్టప్ కలలు కనే యువతరాన్ని ఈ విజయం వెన్నుతడుతుంది. రెండు... స్మార్ట్‌ఫోన్ జెనరేషన్‌ను స్టాక్‌మార్కెట్‌కు చేరువ చేయడానికి ఉపకరిస్తుంది.
చదవండి: Vidit Aatrey: అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!!
Comments
Please login to add a commentAdd a comment