రష్యాలో ఒక రేడియో స్టేషన్ దాదాపు నలభయ్యేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తోంది. దీని నుంచి ఇరవై నాలుగు గంటలూ సిగ్నల్స్ వెలువడుతూనే ఉంటాయి. రేడియో సెట్లు, ట్రాన్సిస్టర్లలో ఈ స్టేషన్‌ను ట్యూన్ చేస్తే, ఆగి ఆగి నిమిషానికి 25 సార్లు ఒక విచిత్రమైన ధ్వని వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరో ఒకరి గొంతు నుంచి ప్రత్యక్ష ప్రసారాలు కూడా దీని నుంచి వెలువడుతూ ఉంటాయి. దీనిని ఎవరు నడుపుతున్నదీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. తొలిసారిగా దీని ఉనికిని 1982లో జనాలు తెలుసుకున్నారు. అప్పటి నుంచి గమనిస్తున్నా, ఏనాడూ దీని నుంచి వెలువడే విచిత్రమైన ధ్వనికి, అప్పుడప్పుడు వెలువడే ప్రసారాలకుగాని ఏమాత్రం అంతరాయం కలగలేదు. ఇది ఆర్మీ రహస్య కార్యకలాపాలకు చెందినది కావచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి.
అయితే, దీనిని నిర్వహిస్తున్నట్లుగా రష్యా ప్రభుత్వం గాని, సైన్యం గాని ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. వారానికి రెండు మూడుసార్లు ఈ రేడియో స్టేషన్ నుంచి వ్యవసాయ నిపుణుల సలహాలు, పశువుల పెంపకం వంటి కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ఉంటాయి. ఈ రేడియో స్టేషన్ ప్రసారాలు 4625 కిలోహెర్ట్›్జ ఫ్రీక్వెన్సీలో ప్రసారమవుతుంటాయని మాత్రమే జనాలకు తెలుసు. అంతకు మించిన వివరాలేవీ ఎవరికీ తెలీదు. దీని పేరేమిటో కూడా తెలీదు. దీని నుంచి వెలువడే సిగ్నల్ ధ్వని కారణంగా జనాలే దీనికి ‘ఎండీజెడ్‌హెచ్‌బీ’ (ఎంజేబీ అని పలకాలి) అని పేరు పెట్టుకున్నారు. రష్యన్ మాటలో ఈ మాటకు ‘బజర్’ అనే అర్థం ఉంది.
∙
Comments
Please login to add a commentAdd a comment