పంటి చిగుళ్లు వదులుగా అయిపోయి రక్తం వస్తుంటే దాన్ని ఆ వ్యాధిని స్కర్వి అంటాం. ఇది విటమిన్-సి లోపం వల్ల వస్తుంది. చిగుళ్ల బలానికి ఏం తినాలి? అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే..
విటమిన్-సి తగ్గితే ఈ రకమైన వ్యాధి వస్తుంది. నిమ్మ జాతి పండ్లైన జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ఉసిరి, టమాట సహా కొన్ని పండ్లు, కూరగాయల్లో విటమిన్-సి ఉంటుంది. వేడి చేసినా, ఎక్కువ కాలం నిలువ చేసినా విటమిన్-సి నశిస్తుంది. కాబట్టి తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటేనే సరైన ప్రయోజనం ఉంటుంది. మరి రోజూ ఆహారంలో విటమిన్-సి ఎంత మేరకు తీసుకోవాలి?
మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా తగినంత మోతాదులో ఉండాలి. ఏ వయసు వారు ఎంత మేర తీసుకోవాలి?
0–6 నెలలు 40 మి.గ్రా(తల్లిపాల ద్వారా) తీసుకోవాలి.
7–12 నెలలు 50 మి.గ్రా
1–3 సం. 15 మి.గ్రా
4–8 సం. 25 మి.గ్రా
9–13 సం. 45మి.గ్రా
14–18సం.75 మి.గ్రా(పు) 65మి.గ్రా(స్త్రీ)
19 సం. పైన 90మి.గ్రా(పు) 75 మి.గ్రా(స్త్రీ)
గర్భిణులు 85 మి.గ్రా
పాలిచ్చే తల్లులు 120 మి.గ్రా
ధూమపానం చేసే వారు 35మి. గ్రా అదనంగా తీసుకోవాలి.
అంటే..
1 - 2 గ్రా. రోజుకి 3 రోజులు
500 మి. గ్రా తరువాత 7 రోజులు
100 మి. గ్రా 3 నెలల వరకు తీసుకోవాలి.
ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం చిగుళ్ళ వ్యాధులకు కారణం శరీరంలో త్రి దోషాలు అస్తవ్యస్తం కావటం. దీని నివారణకు
►ఉత్తరేణి వేరు, లేదా,చండ్ర ,వేప, నేరేడు, మామిడి, వీటి పుల్లలలో ఏదో ఒకటి దంతధావనానికి ఉపయోగించాలి.
► ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలి.
► ఎండు ద్రాక్ష, లేదా కిస్మిస్ పండ్లు (10) రాత్రి నానబెట్టి ఉదయాన్నే లేచి,ఆ నీటిని తాగి, పండ్లు తినాలి (సుమారు 2నెలలు).
► పరగడుపున ఒక చెంచా చొప్పున నల్లనువ్వులు తిని ,ఒక గ్లాసు పరిశుద్ధమైన నీరు త్రాగితే, కదిలే దంతాలు గట్టి పడును
► ఒక రాగి పాత్రలో (250ml) పరిశుద్ధమైన నీరు పోసి, ఉదయాన్నే ముందుగా 6.-పరగడుపున తాగటం ఎలాంటి వ్యాధులు దరిచేరవు.
-మీ నవీన్ నడిమింటి
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment