Top Stories
ప్రధాన వార్తలు

కొత్త కొలువులు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలూ హుష్!
అయ్యా.. బాబూ.. నిరుద్యోగ భృతి ఇవ్వండని యువత అడుగుతుంటే.. ఉద్యోగాలొస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కనీవినీ ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30 వేల మందికి వందల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్‌లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని తేలింది. కూటమి సర్కారు వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చయ్యే రూ.1500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే.. పలుకుబడిగల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక విధాన పత్రంలోనే స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం రూ.177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో వృత్తిపరమైన సర్వీసు పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.747 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది.మేనిఫెస్టోకు మంగళం!సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పలుకుబడి గల వారికి నెలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ కన్సల్టెంట్లుగా నియమించుకుంటోంది. సామాన్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయం గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా, వారికి వేతనాల కింద ఏటా రూ.1,500 కోట్లు చెల్లించిందని గత నవంబర్‌లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో వలంటీర్లను తొలగించేసింది. తమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉంటే వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.2,604 కోట్లు చెల్లించిందని గత నవంబర్‌లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 94,420కి తగ్గిపోయినట్లు తెలిపింది. వారికి వేతనాల కింద ఏటా రూ.2,329 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొంది.ఉద్యోగాల కుదింపే లక్ష్యంగత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా కూటమి సర్కారు భర్తీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గిపోయింది. అలాగే గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది ఉండగా, కూటమి సర్కారులో 53,122కు తగ్గిపోయింది.నాడు మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో 72,747కు తగ్గిపోయింది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గిపోయింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 46,646కు పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఏలు 19,406 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 18,435కు తగ్గిపోయింది. దీన్నిబట్టి ఉద్యోగాలను తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టమవుతోంది.

గుంటూరు జైలు నుంచి నేడు పోసాని విడుదల
సాక్షి, గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. పోసానికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో నేడు విడుదల కానున్నారు. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరైంది.కూటమి సర్కార్.. పోసానిపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. కక్ష సాధింపుతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశారు. పిటీ వారెంట్ పేరుతో పోలీసులు.. ఆయన్ను రాష్ట్రమంతా తిప్పారు. దీంతో, ఆయన కోర్టును ఆశ్రయించగా.. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇక, పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా.. న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు..ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించింది.

అమెరికా నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. ట్రంప్ మాస్టర్ ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో 5,30,000 మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా అమెరికాను వీడాల్సి ఉంటుంది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే టారిఫ్‌లు విధించే అంశంలో బిజీగా ఉన్న ట్రంప్ మరో బాంబు పేల్చారు. అమెరికాలో 5,30,000 మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదా రద్దుకు పెద్ద ప్లాన్ చేశారు. లక్షలాది మంది క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వా, వెనెజువెలా వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇక, ఒక నెలలోనే వారిని బహిష్కరించే అవకాశం ఉంది.🚨 #BREAKING: President Trump has just REVOKED the legal status of 530,000 Haitians, Cubans, Nicaraguans, and Venezuelans imported by Joe Biden by planeCUE THE MASS DEPORTATIONS! 🔥The Biden administration was secretly flying in these foreigners and releasing them all… pic.twitter.com/VQtUSGBxJD— Nick Sortor (@nicksortor) March 21, 2025ఈ క్రమంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ.. ఆర్థిక స్పాన్సర్లతో అక్టోబర్ 2022 నుండి అమెరికాకు చేరుకున్న ఈ నాలుగు దేశాల వలసదారులు అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంది. అలాగే అమెరికాలో పని చేయడానికి రెండు సంవత్సరాల అనుమతులు పొందిన వారు ఏప్రిల్ 24 తర్వాత వారి చట్టపరమైన హోదాను కోల్పోతారని పేర్కొంది. దీంతో, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఈ వలసదారులకు మంజూరు చేయబడిన రెండు సంవత్సరాల పెరోల్ రద్దు కానుంది. కాగా, జో బైడెన్.. 2022లో వెనిజులా ప్రజల కోసం పెరోల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2023లో దానిని విస్తరించారు. దీంతో, భారీ సంఖ్యలో వలసదారులు అమెరికాకు వచ్చారు.

చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: చైనా దుందుడుకు వ్యవహారిశైలిపై భారత్ మరోమారు మండిపడింది. భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఇటీవల చైనా(China) రెండు కొత్త కౌంటీలను సృష్టించింది. వీటిలో కొంత ప్రాంతం భారత్‌లోని లడఖ్‌లో ఉంది. దీనిపై భారత్ బలమైన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు పార్లమెంటులో పేర్కొంది.లోక్‌సభ(Lok Sabha)లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ.. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదని, ఆ దేశపు కొత్త కౌంటీల ఏర్పాటు.. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దీర్ఘకాల వైఖరిని ప్రభావితం చేయబోదన్నారు. చైనా పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణను భారత్ చట్టబద్ధం చేయబోదన్నారు.లడఖ్‌లోని భారత భూభాగాన్ని కలుపుకొని హోటాన్ ప్రావిన్స్‌లో చైనా రెండు కొత్త కౌంటీలను సృష్టించడం గురించి ప్రభుత్వానికి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు తీసుకుందో తెలపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను అడినప్పుడు సింగ్ ఈ సమాధానం చెప్పారు. చైనాలోని హోటాన్ ప్రావిన్స్‌లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటుకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని లడఖ్(Ladakh) కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వస్తాయన్నారు. సరిహద్దు ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని కూడా ప్రభుత్వానికి కూడా తెలుసునని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకే భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తద్వారా భారత్ తన వ్యూహాత్మక, భద్రతా అవసరాలను మెరుగుపరుచుకుంటుందన్నారు. ఇది కూడా చదవండి: కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం

నేడు కర్ణాటక బంద్.. పోలీసుల భారీ సెక్యూరిటీ
బెంగళూరు: కర్ణాటకలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలు, ప్రైవేటు సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయి. దీంతో, పాక్షికంగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ కొనసాగనుంది.కేఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్‌పై మరాఠీలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఈఎస్‌ను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక బంద్‌కు వాటాళ్ నాగరాజ్ నేతృత్వంలో కన్నడ ఒక్కూట్ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఓలా, ఉబర్, డ్రైవర్ల నుంచి కొన్ని ఆటో సంఘాలు బంద్‌కు మద్దతు వ్యక్తం చేశాయి. హోటల్ యజమానుల సంఘం నైతికంగా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ శెట్టి వర్గం బంద్‌కు మద్దతు ప్రకటించింది.Belagavi, Karnataka: Amid the Karnataka bandh, Maharashtra transport buses have stopped entering Karnataka and are operating only up to the border. In Belgaum, security has been tightened as pro-Kannada activists plan to stage protests. Police and Home Guards personnel have been… pic.twitter.com/6eKYLhQR7Z— IANS (@ians_india) March 22, 2025#WATCH | Karnataka: Passengers arrive at a bus terminal in Bengaluru amid pro-Kannada groups' 12-hour statewide bandh in protest against the alleged assault on a bus conductor in Belagavi for not speaking Marathi. pic.twitter.com/rT5yseoLna— ANI (@ANI) March 22, 2025ఇక, అత్యవసర సేవలైన పాలు, ఔషధం, దినపత్రిక, కూరగాయల సరఫరా ఎప్పటిలాగే ఉంటాయి. వాటాళ్ నాగరాజ్ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ దయానందను భేటీ చేసి బంద్‌కు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. అయితే సానుకూల స్పందన రాలేదు. అయినా బంద్ చేసి తీరుతానని వాటాళ్ తెలిపారు. కర్ణాటక బంద్‌కు చలనచిత్ర వాణిజ్య మండలి మద్దతును ప్రకటించింది. అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ బంద్‌కు మద్దతు ఉంటుందని, అయితే సినిమా షూటింగ్ యధా ప్రకారంగా జరుగుతాయన్నారు. థియేటర్ల యజమానులు బంద్‌కు మద్దతు ఇచ్చారు. ఉదయం ప్రదర్శన బంద్ చేస్తామని, మధ్యాహ్నం తరువాత సినిమాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.#WATCH | Karnataka: Several pro-Kannada groups have called a bandh in the state today from 6 am to 6 pm, in protest against the alleged assault on a bus conductor in Belagavi for not speaking Marathi. Visuals from Kalaburagi, where Police personnel have been deployed as a… pic.twitter.com/atR3C3pPxw— ANI (@ANI) March 22, 2025భారీ భద్రత..బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా శనివారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాఠశాల–కాలేజీలకు సెలవు ఇచ్చే విషయం ఎలాంటి తీర్మానం తీసుకోలేదని మంత్రి మధు బంగారప్ప తెలిపారు. రవాణా సదుపాయం లేకపోతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పరీక్షలు ప్రారంభమైన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో విషాదం.. మార్నింగ్ వాక్కు వెళ్లి అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అడిషనల్ ఎస్పీ టీఎం. నందీశ్వర బాబ్జీ రోడ్డు దాటుతున్న సమయంలో అతడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.

నేటి నుంచి పరుగుల పండుగ
2008 మండు వేసవిలో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. ఈ మొదటి పోరులో మెకల్లమ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అగ్గి పుట్టించాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అతను అంటించిన మంట ఆ తర్వాత అంతకంతా పెరిగి దావానంలా మారి అన్ని వైపులకు వ్యాపించిపోయింది. టి20 క్రికెట్లో ఉండే బ్యాటింగ్ ధమాకా ఏమిటో అందరికీ చూపించేసింది. ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదని... అంతకు మించిన వినోదమని సగటు అభిమాని ఆటతో పాటు ఊగిపోయేలా చేసింది ఈ లీగ్. ఐపీఎల్లో 17 సీజన్లు ముగిసిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్‌లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. దిగ్గజాలు స్వల్పకాలం పాటు తామూ ఓ చేయి వేసి తప్పుకోగా, తర్వాతి తరం ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఎన్ని మార్పులు వచి్చనా మారనిది లీగ్‌పై అభిమానం మాత్రమే. ఇన్ని సీజన్లలో కలిపి 1030 మ్యాచ్‌లు జరిగినా ఇప్పటికీ అదే ఉత్సాహం. అంతర్జాతీయ మ్యాచ్‌కంటే వేగంగా సీట్లు నిండిపోతుండగా, ఆటగాళ్ల రాక సినిమా ట్రైలర్‌లా కనిపిస్తోంది. ఇలాంటి వీరాభిమానం మధ్య ఐపీఎల్ 18వ పడిలోకి అడుగు పెడుతోంది. కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2025కు రంగం సిద్ధమైంది. నేడు మొదలు కానున్న 18వ సీజన్ 65 రోజుల పాటు జోరుగా సాగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 69 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 4 ‘ప్లే ఆఫ్స్’ సమరాల తర్వాత మే 25న ఇదే మైదానంలో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని ఆట, పాటలతో కూడిన ప్రత్యేక ప్రారంబోత్సవ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రేమించే లీగ్ మళ్లీ వచ్చిన నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన పలు విశేషాలు... 300 దాటతారా! ఐపీఎల్లో ఇప్పటి వరకు టీమ్ అత్యధిక స్కోరు 287 పరుగులు. గత ఏడాది బెంగళూరుపై సన్‌రైజర్స్ ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్లో మొత్తం 250కు పైగా స్కోరు10 సార్లు నమోదైతే ఇందులో ఎనిమిది 2024లోనే వచ్చాయి. కొత్త సీజన్లో ఇలాంటి మరిన్ని మెరుపు ప్రదర్శనలు రావచ్చని అంతా భావిస్తున్నారు. బ్యాటర్లు జోరు సాగితే తొలిసారి లీగ్‌లో 300 స్కోరు కూడా దాటవచ్చు.2008 నుంచి 2025 వరకు... ఐపీఎల్ తొలి సీజన్లో జట్టుతో ఉండి ఈసారి 18వ సీజన్లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం. ధోని, కోహ్లి, రోహిత్, మనీశ్ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఒకే ఒక జట్టు తరఫున కొనసాగుతున్నాడు. ఇందులో 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ప్రస్థానం భిన్నం. 2008లో ముంబై టీమ్‌తో ఉన్నా... 2016లో పంజాబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. మొత్తంగా 5 సీజన్లే అవకాశం దక్కించుకున్న అతను 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. రోహిత్, కోహ్లి మళ్లీ టి20ల్లో... గత ఏడాది టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పలికారు. ఇప్పుడు వారి టి20 ఆటను చూసే అవకాశం మళ్లీ ఐపీఎల్‌లోనే కలగనుంది.ఆ ఒక్కటీ అడక్కు! ఐపీఎల్ రాగానే ఎమ్మెస్ ధోనికి ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.2025 లీగ్ వివరాలు» మొత్తం 13 వేదికల్లో టోర్నీ జరుగుతుంది. 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా... 3 జట్లు రెండు వేదికలను హోం గ్రౌండ్లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్‌లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడుతుంది. » ఐపీఎల్ ప్రదర్శనను బట్టే 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చెన్నై, కోల్‌కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున (8 మ్యాచ్‌లు), మరో గ్రూప్‌లో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు (2), మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ (4) ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్‌లు వస్తాయి. వీటిలో 7 సొంత గ్రౌండ్లలో ఆడతాయి. » కొత్త సీజన్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బంతిని షైన్ చేసేందుకు ఉమ్మి (సలైవా)ను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్‌కు సంబంధించిన వైడ్లు, ఆఫ్ సైడ్ వైడ్లను తేల్చేందుకు కూడా డీఆర్ఎస్ సమయంలో ‘హాక్ ఐ’ ని ఉపయోగిస్తారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు బంతి దెబ్బ తిందని భావించి మార్చే విచక్షణాధికారం అంపైర్లకే ఉండేది. అయితే ఇప్పుడు ఫీల్డింగ్ కెపె్టన్ బంతి మార్చమని కోరవచ్చు. » అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. మొత్తం షెడ్యూల్లో 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.» గత ఏడాదితో పోలిస్తే ఐదు టీమ్‌లు కొత్త కెపె్టన్లతో బరిలోకి దిగుతున్నాయి. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), అజింక్య రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్), రజత్ పాటీదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఆయా టీమ్‌లకు తొలిసారి సారథులుగా వ్యవహరించనున్నారు. నిషేధం కారణంగా ముంబై తొలి మ్యాచ్‌కు పాండ్యా స్థానంలో సూర్యకుమార్... గాయం నుంచి సామ్సన్ కోలుకోకపోవడంతో రాజస్తాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌కెప్టెన్లుగా మైదానంలోకి దిగుతారు. వేలంలో రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన రిషభ్ పంత్‌పై ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్‌గా అందరి దృష్టీ ఉంది.ఐపీఎల్ విజేతలు (2008 నుంచి 2024 వరకు)2008 రాజస్తాన్ రాయల్స్ 2009 డెక్కన్ చార్జర్స్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ 2011 చెన్నై సూపర్ కింగ్స్ 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2013 ముంబై ఇండియన్స్ 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2015 ముంబై ఇండియన్స్ 2016 సన్‌రైజర్స్ హైదరాబాద్ 2017 ముంబై ఇండియన్స్ 2018 చెన్నై సూపర్ కింగ్స్ 2019 ముంబై ఇండియన్స్ 2020 ముంబై ఇండియన్స్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ 2022 గుజరాత్ టైటాన్స్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ 2024 కోల్‌కతా నైట్‌రైడర్స్

లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) మార్చి 27న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన ఒక కీలకమైన పాత్రలో కూడా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా రెమ్యునరేషన్ వివరాల గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు.'లూసిఫర్2' కోసం మోహన్‌లాల్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ పెరగడంతో సినిమా చిత్రీకరణ విషయంలో కాస్త జాప్యం ఏర్పడిందని పృథ్వీరాజ్ తెలిపారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్‌లాల్, ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.మోహన్‌లాల్ రెమ్యునరేషన్ గురించి గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. లూసిఫర్ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తీయాలని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ ముందుకు రావడంతో సినిమా మొదలైంది. అయితే, బడ్జెట్ పెరిగిపోవడంతో ఆ ఇబ్బందులు గ్రహించిన మోహన్‌లాల్ తనకు రెమ్యునరేషన్ వద్దని చెప్పారట. అదే విషయాన్ని ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. అయితే, ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను సుకుమారన్ తీసుకున్నారు. అందుకు గాను ఆయన కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, సినిమా నుంచి లాభాలు ఏమైనా వస్తే అందులో షేర్ తీసుకునే ఛాన్స్ ఉంది.కన్నప్పకు కూడా అండగా నిలిచిన మోహన్లాల్మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్పలో మోహన్‌లాల్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించాలని మోహన్‌లాల్‌ను కోరిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి విష్ణు తెలిపారు. 'అంకుల్.. రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్‌తో ఏమైనా మాట్లాడమంటారా అని అడిగాను. అప్పుడు ఆయన నవ్వుతూనే.. ‘నువ్వు అంత పెద్ద వాడివయ్యావా..?’ అని అన్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ కూడా ఎలాంటి రెమ్యునరేషన తీసుకోలేదని విష్ణు చెప్పిన విషయం తెలిసిందే.

ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
ఎడ్యుటెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు ముందస్తు గోప్యతా దరఖాస్తు ద్వారా సెబీని ఆశ్రయించింది. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్‌బోర్డులో లిస్టయ్యేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు ఫిజిక్స్‌వాలా తాజాగా ప్రకటించింది. అయితే ముందస్తు ఫైలింగ్ ద్వారా ఐపీవోకు వెళ్లడంపై గ్యారంటీలేదని స్పష్టం చేసింది. వెరసి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ బాటలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తును ఎంచుకుంది. పలు కంపెనీలు..ఇంతకుముందు 2023లోనూ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అంతకంటే ముందు 2022 డిసెంబర్లో టాటా ప్లే(స్కై) రహస్య దరఖాస్తు చేసి 2023 ఏప్రిల్‌లో సెబీ అనుమతి పొందింది. అయితే ఈ రెండు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టకపోవడం గమనార్హం! కాగా.. 2020లో ఏర్పాటైన ఫిజిక్స్‌వాలా ఆన్లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దేశవ్యాప్తంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో హార్న్‌బిల్ క్యాపిటల్ ఆధ్వర్యంలో 21 కోట్ల డాలర్ల(రూ.1,800 కోట్లు) పెట్టుబడులు అందుకుంది. 2.8 బిలియన్ డాలర్ల విలువలో నిధులు సమకూర్చుకుంది. ముందస్తు ఫైలింగ్ ఎంచుకుంటే సెబీ తుది అనుమతి తదుపరి ఐపీవోకు 18 నెలల గడువు లభిస్తుంది. సాధారణ పద్ధతిలో అయితే 12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్ రూ.550 కోట్లపై కన్నుప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 550 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు 100 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా బాటిళ్లు, కంటెయినర్లు, మూతలు, టబ్‌లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ విడిభాగాలు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, పానీయాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, లూబ్రికెంట్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.397 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభం ఆర్జించింది.

ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.ఎలా ప్రారంభమైందంటే? 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.ప్రాముఖ్యత ఎందుకు..మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్‌లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం. చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్‌ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్‌లో ఇంత మోసమా..? వైరల్‌గా హర్ష గోయెంకా పోస్ట్)
వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలి
MS Dhoni: ఆ ఒక్కటీ అడక్కు!
యువకుడి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్
లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్
కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం
ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్
నీ భర్తను వదిలేసి నాతో రా...
హెచ్‌సీఎల్ గ్రూప్‌తో ప్రుడెన్షియల్ జత
అమెరికా నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. ట్రంప్ మాస్టర్ ప్లాన్!
వీడియో: వెడ్డింగ్ ఫొటో షూట్లో మిస్ ‘ఫైర్’
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
మనకు శాంతి అంటేనే నమ్మకద్రోహం!
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు
‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
పోసానికి బెయిల్ మంజూరు
'భారతరత్న' అవార్డ్స్.. రేసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు
మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. అయినా ఐపీఎల్‌ను వదలని కేన్ మామ
వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలి
MS Dhoni: ఆ ఒక్కటీ అడక్కు!
యువకుడి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్
లూసిఫర్2: 'మోహన్‌లాల్' రెమ్యునరేషన్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్
కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం
ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్
నీ భర్తను వదిలేసి నాతో రా...
హెచ్‌సీఎల్ గ్రూప్‌తో ప్రుడెన్షియల్ జత
అమెరికా నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. ట్రంప్ మాస్టర్ ప్లాన్!
వీడియో: వెడ్డింగ్ ఫొటో షూట్లో మిస్ ‘ఫైర్’
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
మనకు శాంతి అంటేనే నమ్మకద్రోహం!
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు
‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
పోసానికి బెయిల్ మంజూరు
'భారతరత్న' అవార్డ్స్.. రేసులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు
మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. అయినా ఐపీఎల్‌ను వదలని కేన్ మామ
సినిమా

‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ రివ్యూ
కమెడియన్ గా పీక్స్ లో ఉన్న సమయంలోనే సప్తగిరి హీరోగా టర్న్ తీసుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ‘పెళ్లికాని ప్రసాద్’అనే సినిమాతో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రంతో సప్తగిరికి హిట్ పడిందా లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘పెళ్లికాని ప్రసాద్’ కథేంటంటే..?ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది. ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏజ్ బార్ అవుతున్న హీరోకి పెళ్లి కాదు. పెళ్లి కోసం నానా కష్టాలు పడడం.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. పెళ్ళికానీ ప్రసాద్ సినిమా కథ కూడా ఇదే. దర్శకుడు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ని కథగా ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తి ఉన్నా అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా ఉంది. అలాంటి సమయంలో హీరో తండ్రి కట్నం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఇదంతా మనకి తెలిసిన..చూసిన కథే. అయితే తెరపై చూస్తే మాత్రం... కొంతమేర ఎంటర్టైన్ అవుతాం. కొన్ని చోట్ల కామెడీ అతిగా అనిపించినా.. మరికొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది.హీరోయిన్ ఫ్యామిలీ ఎందుకు విదేశాలల్లో సెటిల్ కావాలనుకుంటుందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత హీరో మలెషియా నుంచి పెళ్లి కోసం ఇండియాకు రావడం..పెళ్లి చూపులు..ఇవన్నీ పాత సినిమాలను గుర్తు చేస్తాయి. హీరో హీరోయిన్లు కలిసినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ప్రసాద్‌ని ట్రాప్ చేయడానికి ఖుషీ సీన్ రిపీట్ చేయడం.. అలాగే అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పడం.. ఇవన్నీ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథనం సాగదీతగా అనిపిస్తాయి. నవ్వించడానికే పెట్టిన కొన్ని సీన్లు.. అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సెకండాఫ్ కథను ఇంకాస్త బలంగా రాసుకొని.. క్లైమాక్స్ విషయంలో జాగ్రత్త పడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్‌గా ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా.. సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఎవరెలా చేశారంటే..సప్తగిరి వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. సప్తగిరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర మురళీధర్ గౌడ్ ది. పూర్వికుల ఆచారాన్ని పాటిస్తూ కట్నం కోసం కన్నకొడుకు జీవితాన్నే ఇబ్బందులకు గురి చేసే నాన్న పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.హీరోయిన్ ప్రియాంక్ శర్మ పాత్రకి నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు కానీ కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.టెక్నికల్ టీం విషయానికి వస్తే .. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘పెళ్లికాని ప్రసాద్’ టీమ్ వివరాలుదర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడినిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాలబ్యానర్: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్ డిఓపి: సుజాత సిద్దార్థ్సంగీతం: శేఖర్ చంద్రఎడిటర్: మధు- రేటింగ్: 2.5/5

బాలకృష్ణ షో వల్లే బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా: బాధితుడి ఆవేదన
బెట్టింగ్ యాప్ కేసు టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి యాప్‌లను కొందరు టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు పలువురు అగ్ర సినీతారల పేర్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ముందు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరైన తమ స్టేట్మెంట్ ఇచ్చారు. యాప్‌లను ప్రమోట్ చేసినట్లు విచారణలో అంగీకరించారు.అయితే ఈ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని అప్పులపాలైన వారు చాలామందే ఉన్నారు. అలా ఈ బెట్టింగ్ భూతానికి బలైన ఓ సామాన్యుడు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. తాను ఈ యాప్‌ను ఉపయోగించడానికి కారణం ఆ టాలీవుడ్ షోనే కారణమని బాధితుడు చెప్పారు.టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో వల్లే తాను బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించానని నెల్లూరు చెందిన రాంబాబు వాపోయారు. బాలయ్య షోకు అతిథులుగా వచ్చిన గోపీచంద్, ప్రభాస్‌కు బాలకృష్ణ కొన్ని బహుమతులిస్తారు.. ఈ గేమ్ ఆడండి.. గిఫ్ట్‌లు గెలుచుకోండి అని చూపించారని అన్నారు. నేను మొదటి నుంచి ప్రభాస్ అన్నకు ఫ్యాన్ అని.. అందువల్లే తాను కూడా ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ట్రాప్‌లో పడి దాదాపు రూ.80 లక్షలు కోల్పోయినట్లు సదరు వ్యక్తి వివరించాడు. ఆ యాప్ వాళ్లు మోసం చేయడం వల్లే తాను అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో ఎనిమిది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు బాధితుడు రాంబాబు చెప్పుకొచ్చారు.

కోటి రూపాయలకు మళ్లీ అమ్మేస్తావా?.. శుభలగ్నం సీన్ గుర్తు చేసిన జగపతిబాబు
టాలీవుడ్ నటుడు జగపతి బాబు విలక్షణ పాత్రలతో వెండితెరపై అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది పుష్ప-2తో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న కీ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటారు. తాను ఎక్కడికెళ్లినా వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.ఇందులో ఆమని, జగపతిబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ఓ మూవీ షూటింగ్ సెట్లో వీరిద్దరు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో పార్ట్-1.. కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.. పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు. మొదటి వీడియోలో ఆమనికి జగపతిబాబు మేకప్ వేయగా.. రెండో పార్ట్‌లో ఆమనికి జగపతి బాబు మేకోవర్ చేశారు. ఇదంతా షూటింగ్ సెట్లో సరదా కోసమే చేశారు.అయితే గతంలో వీరిద్దరు జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో తన భర్త అయిన జగపతిబాబును అమ్మకానికి పెడుతుంది. ఆ సీన్‌ను గుర్తుకు తెచ్చుకున్న జగపతి బాబు సరదాగా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మళ్లీ ఇద్దరు కలిసి సరదాగా ఇలా చేయడంతో ఇది చూసిన అభిమానులు శుభలగ్నం సినిమాను గుర్తు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

శంకర్ సంచలనం
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువతార శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై శంకర్ అద్భుత విజయం సాధించాడు. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల శంకర్ శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 21–12, 21–5తో ఆంటోన్సెన్ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2022 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శంకర్ 66 నిమిషాల పోరులో ఆంటోన్సెన్ ఆట కట్టించాడు. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు రజతం, ఒకసారి కాంస్య పతకం నెగ్గిన ఆంటోన్సెన్ తొలి గేమ్ గెలిచినప్పటికీ... ఆ తర్వాత ప్రపంచ 68వ ర్యాంకర్ శంకర్ ధాటికి చేతులెత్తేశాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో శంకర్ తలపడతాడు. మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–18, 21–14తో పుయ్ లామ్ యెంగ్–ఎన్గా టింగ్ యెయుంగ్ (హాంకాంగ్) జంటపై విజయం సాధించింది.

నేటి నుంచి పరుగుల పండుగ
2008 మండు వేసవిలో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. ఈ మొదటి పోరులో మెకల్లమ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అగ్గి పుట్టించాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అతను అంటించిన మంట ఆ తర్వాత అంతకంతా పెరిగి దావానంలా మారి అన్ని వైపులకు వ్యాపించిపోయింది. టి20 క్రికెట్లో ఉండే బ్యాటింగ్ ధమాకా ఏమిటో అందరికీ చూపించేసింది. ఐపీఎల్ అంటే క్రికెట్ మాత్రమే కాదని... అంతకు మించిన వినోదమని సగటు అభిమాని ఆటతో పాటు ఊగిపోయేలా చేసింది ఈ లీగ్. ఐపీఎల్లో 17 సీజన్లు ముగిసిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. లీగ్‌లో ఆటగాళ్లు మారగా, కొన్ని నిబంధనలూ మారాయి. దిగ్గజాలు స్వల్పకాలం పాటు తామూ ఓ చేయి వేసి తప్పుకోగా, తర్వాతి తరం ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఎన్ని మార్పులు వచి్చనా మారనిది లీగ్‌పై అభిమానం మాత్రమే. ఇన్ని సీజన్లలో కలిపి 1030 మ్యాచ్‌లు జరిగినా ఇప్పటికీ అదే ఉత్సాహం. అంతర్జాతీయ మ్యాచ్‌కంటే వేగంగా సీట్లు నిండిపోతుండగా, ఆటగాళ్ల రాక సినిమా ట్రైలర్‌లా కనిపిస్తోంది. ఇలాంటి వీరాభిమానం మధ్య ఐపీఎల్ 18వ పడిలోకి అడుగు పెడుతోంది. కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2025కు రంగం సిద్ధమైంది. నేడు మొదలు కానున్న 18వ సీజన్ 65 రోజుల పాటు జోరుగా సాగనుంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. 2008 తర్వాత ఇరు జట్ల మధ్య సీజన్ తొలి మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 69 లీగ్ మ్యాచ్‌లు, ఆపై 4 ‘ప్లే ఆఫ్స్’ సమరాల తర్వాత మే 25న ఇదే మైదానంలో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. గత మూడు సీజన్ల తరహాలోనే ఇప్పుడు కూడా 10 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. మొదటి మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని ఆట, పాటలతో కూడిన ప్రత్యేక ప్రారంబోత్సవ కార్యక్రమం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రేమించే లీగ్ మళ్లీ వచ్చిన నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన పలు విశేషాలు... 300 దాటతారా! ఐపీఎల్లో ఇప్పటి వరకు టీమ్ అత్యధిక స్కోరు 287 పరుగులు. గత ఏడాది బెంగళూరుపై సన్‌రైజర్స్ ఈ స్కోరు సాధించింది. ఐపీఎల్లో మొత్తం 250కు పైగా స్కోరు10 సార్లు నమోదైతే ఇందులో ఎనిమిది 2024లోనే వచ్చాయి. కొత్త సీజన్లో ఇలాంటి మరిన్ని మెరుపు ప్రదర్శనలు రావచ్చని అంతా భావిస్తున్నారు. బ్యాటర్లు జోరు సాగితే తొలిసారి లీగ్‌లో 300 స్కోరు కూడా దాటవచ్చు.2008 నుంచి 2025 వరకు... ఐపీఎల్ తొలి సీజన్లో జట్టుతో ఉండి ఈసారి 18వ సీజన్లో కూడా బరిలోకి దిగబోయే ఆటగాళ్లు 9 మంది ఉండటం విశేషం. ధోని, కోహ్లి, రోహిత్, మనీశ్ పాండే, రహానే, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, స్వప్నిల్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఒకే ఒక జట్టు తరఫున కొనసాగుతున్నాడు. ఇందులో 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ ప్రస్థానం భిన్నం. 2008లో ముంబై టీమ్‌తో ఉన్నా... 2016లో పంజాబ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. మొత్తంగా 5 సీజన్లే అవకాశం దక్కించుకున్న అతను 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. రోహిత్, కోహ్లి మళ్లీ టి20ల్లో... గత ఏడాది టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ పలికారు. ఇప్పుడు వారి టి20 ఆటను చూసే అవకాశం మళ్లీ ఐపీఎల్‌లోనే కలగనుంది.ఆ ఒక్కటీ అడక్కు! ఐపీఎల్ రాగానే ఎమ్మెస్ ధోనికి ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో.2025 లీగ్ వివరాలు» మొత్తం 13 వేదికల్లో టోర్నీ జరుగుతుంది. 7 టీమ్‌లకు ఒకే ఒక హోం గ్రౌండ్ ఉండగా... 3 జట్లు రెండు వేదికలను హోం గ్రౌండ్లుగా ఎంచుకున్నాయి. ఢిల్లీ తమ మ్యాచ్‌లను ఢిల్లీతోపాటు విశాఖపట్నంలో, పంజాబ్ తమ మ్యాచ్‌లను ముల్లన్‌పూర్‌తో పాటు ధర్మశాలలో, రాజస్తాన్ తమ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలో ఆడుతుంది. » ఐపీఎల్ ప్రదర్శనను బట్టే 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చెన్నై, కోల్‌కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా 4 జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున (8 మ్యాచ్‌లు), మరో గ్రూప్‌లో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు (2), మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ (4) ఆడతాయి. అందరికీ సమానంగా 14 మ్యాచ్‌లు వస్తాయి. వీటిలో 7 సొంత గ్రౌండ్లలో ఆడతాయి. » కొత్త సీజన్లో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. బంతిని షైన్ చేసేందుకు ఉమ్మి (సలైవా)ను వాడేందుకు అనుమతినిచ్చారు. హైట్‌కు సంబంధించిన వైడ్లు, ఆఫ్ సైడ్ వైడ్లను తేల్చేందుకు కూడా డీఆర్ఎస్ సమయంలో ‘హాక్ ఐ’ ని ఉపయోగిస్తారు. స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్లపై జరిమానా వేయడాన్ని, సస్పెన్షన్ విధించడాన్ని తొలగించారు. దానికి బదులుగా డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు. రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఉందని భావిస్తే రెండో ఇన్నింగ్స్ సమయంలో 10 ఓవర్ల తర్వాత ఒక బంతిని మార్చేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటి వరకు బంతి దెబ్బ తిందని భావించి మార్చే విచక్షణాధికారం అంపైర్లకే ఉండేది. అయితే ఇప్పుడు ఫీల్డింగ్ కెపె్టన్ బంతి మార్చమని కోరవచ్చు. » అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. మొత్తం షెడ్యూల్లో 12 రోజులు మాత్రం ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అప్పుడు తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.» గత ఏడాదితో పోలిస్తే ఐదు టీమ్‌లు కొత్త కెపె్టన్లతో బరిలోకి దిగుతున్నాయి. అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్), అజింక్య రహానే (కోల్‌కతా నైట్‌రైడర్స్), రజత్ పాటీదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఆయా టీమ్‌లకు తొలిసారి సారథులుగా వ్యవహరించనున్నారు. నిషేధం కారణంగా ముంబై తొలి మ్యాచ్‌కు పాండ్యా స్థానంలో సూర్యకుమార్... గాయం నుంచి సామ్సన్ కోలుకోకపోవడంతో రాజస్తాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్‌కెప్టెన్లుగా మైదానంలోకి దిగుతారు. వేలంలో రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించిన రిషభ్ పంత్‌పై ఇప్పుడు ఆటగాడిగా, కెప్టెన్‌గా అందరి దృష్టీ ఉంది.ఐపీఎల్ విజేతలు (2008 నుంచి 2024 వరకు)2008 రాజస్తాన్ రాయల్స్ 2009 డెక్కన్ చార్జర్స్ 2010 చెన్నై సూపర్ కింగ్స్ 2011 చెన్నై సూపర్ కింగ్స్ 2012 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2013 ముంబై ఇండియన్స్ 2014 కోల్‌కతా నైట్‌రైడర్స్ 2015 ముంబై ఇండియన్స్ 2016 సన్‌రైజర్స్ హైదరాబాద్ 2017 ముంబై ఇండియన్స్ 2018 చెన్నై సూపర్ కింగ్స్ 2019 ముంబై ఇండియన్స్ 2020 ముంబై ఇండియన్స్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ 2022 గుజరాత్ టైటాన్స్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ 2024 కోల్‌కతా నైట్‌రైడర్స్

IPL 2025: కోల్‌కతాలో వర్షం.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపటి మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0— CricTracker (@Cricketracker) March 21, 2025ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.మరోవైపు రేపటి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్ కొత్త కెప్టెన్ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రజత్ పాటిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్

సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై బిగ్‌బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్‌లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్‌మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్‌ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్‌తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్‌లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్‌తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది.
బిజినెస్

సంక్షోభంలో ‘సూక్ష్మం’
ఆర్థిక సేవలు అంతగా అందని వర్గాలకు రుణాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన సూక్ష్మ రుణాల రంగం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. పెరిగిపోతున్న మొండిబాకీలు, నియంత్రణ నిబంధనల్లో మార్పులు, నిధుల కొరత సమస్యలతో పరిశ్రమ కుదేలవుతోంది. క్రెడిట్ బ్యూరో క్రిఫ్ హై మార్క్ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి మైక్రోఫైనాన్స్ రంగంలో మొండిబాకీలు (ఎన్పీఏ) ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ. 50,000 కోట్లకు ఎగబాకాయి. మొత్తం స్థూల రుణాల పోర్ల్ఫోలియోలో ఇది 13%. ఇక ఎన్పీఏగా మారే రిసు్కలున్న రుణాల పోర్ట్‌ఫోలియో దాదాపు 1% నుంచి 3.3 శాతానికి పెరిగిపోయింది. ఇలాంటి పరిణామాలతో ఇప్పటికే కొన్ని సంస్థల రేటింగ్ పడిపోగా మరిన్ని సంస్థలకు కూడా డౌన్‌గ్రేడ్ ముప్పు నెలకొంది. ఎడాపెడా రుణాలు.. ఆర్థిక పరిస్థితులపై ఆశావహ భావంతో మైక్రోఫైనాన్స్ రంగం గత ఆర్థిక సంవత్సరం భారీగా రుణాలిచ్చేసింది. 2023–24 నాలుగో త్రైమాసికంలో అత్యధికంగా రూ. 48,322 కోట్ల మేర రుణాలిచ్చింది. ఇలాంటి దూకుడు ధోరణే ప్రస్తుత సమస్యకు కారణాల్లో ఒకటయ్యింది. రెండు మూడు సంస్థల దగ్గర అప్పులు తీసుకున్న వారు, సమయానికి వాటిని కట్టలేకపోతుండటంతో రుణాలిచ్చిన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అవి రుణ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎంఎఫ్‌ఐల స్థూల రుణాల పోర్ట్‌ఫోలియో 3.53 శాతం మేర క్షీణించి రూ. 3.85 లక్షల కోట్లకు పరిమితమైనట్లు మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ ఓ నివేదికలో తెలిపింది. అసెట్ క్వాలిటీ కూడా బాగా దెబ్బతిందని వివరించింది. ఇక 91–180 రోజుల వ్యవధి గల మొండిబాకీలు 2023 డిసెంబర్ క్వార్టర్లో నమోదైన 0.9 శాతంతో పోలిస్తే 2024 డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 3.3%కి చేరాయి. 30 రోజులకు మించి బాకీపడిన రుణాల పరిమాణం 3.5% నుంచి 8.8%కి ఎగిసింది. మరోవైపు, క్యూ3లో రుణ వితరణ 35.8% క్షీణించి రూ. 22,091 కోట్లకు పరిమితమైంది. ఎంఎఫ్ఐలు తమ వ్యాపార కార్యకలాపాలకు కావల్సిన నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలపై (డీఎఫ్ఐ) ఆధారపడుతుంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాటికి నిధులు సమకూర్చే విషయంలో బ్యాంకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇచ్చిన రుణాలను కొంత పునర్వ్యవస్థీకరించినా, కొత్త రుణాలివ్వడం కాస్త కష్టతరమే కావొచ్చని ఇండియా రేటింగ్స్ వర్గాలు వెల్లడించాయి. ఇలా తామిచ్చిన రుణాలు సకాలంలో వసూలు కాక, అటు వ్యాపారాన్ని విస్తరించేందుకు రుణాలు రాక ఎంఎఫ్ఐలకు క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంఎఫ్ఐలు, వడ్డీవ్యాపారులు బలవంతపు రికవరీ పద్ధతులకు పాల్పడకుండా కర్ణాటక అమల్లోకి తెచ్చిన కఠినతర ఆర్డినెన్స్ నిబంధనల వల్ల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డౌన్గ్రేడ్ల పరంపర..: ఆర్థిక పనితీరు అంతంత మాత్రంగానే ఉండటంతో పలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రేటింగ్స్ పడిపోతున్నాయి. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ను (ఎస్ఎఫ్ఎల్) ఇక్రా, కేర్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ చేశాయి. డిసెంబర్ క్వార్టర్లో ఎస్ఎఫ్ఎల్ రూ. 601 కోట్ల నష్టం ప్రకటించగా, రూ. 700 కోట్లు రైటాఫ్ చేసింది. అటు ఊహించిన దానికన్నా అసెట్ క్వాలిటీ, లాభదాయకత గణనీయంగా తగ్గిపోవడంతో ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ రేటింగ్‌ను గతేడాది నవంబర్లోనే ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేశాయి. క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్ సైతం క్యూ3లో లాభాల నుంచి నష్టాల్లోకి జారిపోయింది.– సాక్షి, బిజినెస్ డెస్క్మార్చి క్వార్టర్‌పై ఆశలు .. మొండి బాకీల సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి ఇది క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని ఎంఎఫ్ఐఎన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. మార్చి త్రైమాసికం నాటికి లిక్విడిటీతో పాటు రుణ నాణ్యత కూడా మెరుగుపడొచ్చని పేర్కొన్నారు. ప్రాధాన్యతా రంగాలకు రుణలివ్వాల్సిన నిబంధనను పాటించాల్సినందున బ్యాంకుల నుంచి నిధులు లభించి, నాలుగో త్రైమాసికంలో పరిస్థితులు బాగుండవచ్చని భావిస్తున్నారు. అయితే, బ్యాంకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితులు పరిశ్రమలో కన్సాలిడేషన్‌కి దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఐపీఎల్ మజా.. ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు కొత్త డేటా వోచర్లను ప్రవేశపెట్టింది. రూ.100, రూ.195 ధర కలిగిన ఈ కొత్త ప్లాన్లు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అదనపు డేటా కోసం చూస్తున్న వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఈ వోచర్లను ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ పైన రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.100 డేటా వోచర్ఎయిర్టెల్ రూ .100 డేటా వోచర్ 5 జీబీ అదనపు డేటాతో పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 30 రోజుల పాటు అందిస్తుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను ప్రయాణంలో లేదా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.రూ.195 డేటా వోచర్ఎయిర్టెల్ రూ .195 డేటా వోచర్ 15 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఎక్కువ వ్యాలిడిటీ, అధిక డేటాతోపాటు జియో హాట్‌స్టార్ కంటెంట్ యాక్సెస్ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది.ఇతర జియో హాట్‌స్టార్ ప్లాన్లుజియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. రూ.3,999, రూ.1,029, రూ.549, రూ.398 విలువైన ఈ ప్లాన్లు సర్వీస్ వ్యాలిడిటీ, అధిక డేటా పరిమితులు, అదనపు బెనిఫిట్స్ వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

సాఫ్ట్వేర్ కెరియర్.. ఓపెన్ఏఐ సీఈవో వార్నింగ్!
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.అప్పుడది.. ఇప్పుడిది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్‌మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.ఈ అంచనాలను ఆల్ట్‌మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్‌మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగే కొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు.

చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..
ముంబైలోని అత్యంత చరిత్రాత్మకమైన ప్రాపర్టీలలో ఒకటైన లక్ష్మీ నివాస్ బంగ్లా రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేతులు మారింది. నెపియాన్ సీ రోడ్డులో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని రూ.276 కోట్లకు విక్రయించారు. ఇది నగరంలో అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీ నివాస్ దాని నిర్మాణ వైభవానికి మించి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.చరిత్రలో నిలిచిపోయిన భవనం1904లో పార్శీ కుటుంబం నిర్మించిన లక్ష్మీ నివాస్ తరువాత 1917లో కపాడియా కుటుంబం యాజమాన్యంలోకి వచ్చింది. అప్పట్లో కేవలం రూ.1.20 లక్షలకు దీన్ని కొనుగోలు చేశారు. భారత స్వాతంత్య్రోద్యమ కీలక దశలో (1942-1945) లక్ష్మీ నివాస్ దేశంలోని ప్రముఖ విప్లవకారులకు సురక్షిత స్థావరంగా ఆశ్రయం కల్పించింది. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్, అరుణా అసఫ్ అలీ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడ ఆశ్రయం పొందారు.అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ రేడియోకు కీలక ప్రసార కేంద్రంగా ఈ బంగ్లా పనిచేసింది. భారత స్వాతంత్ర్య పోరాట గళాన్ని పెంచింది. బంగ్లా ఉన్న నెపియాన్ సీ రోడ్ ఒకప్పుడు బికనీర్ ప్యాలెస్, కచ్ కోట, వాకనర్ హౌస్ వంటి రాయల్ ఎస్టేట్లతో పాటు ఉన్నత స్థాయి బ్రిటిష్ అధికారుల నివాసాలకు నిలయంగా ఉండేది. అందువల్ల లక్ష్మీ నివాస్ వలసవాద చరిత్రకు, భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది.రికార్డు స్థాయి డీల్జాప్కీకి లభించిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం లక్ష్మీ నివాస్ అమ్మకం గత ఫిబ్రవరి 28న ఖరారైంది. ఈ లావాదేవీలో రూ.16.56 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. 19,891 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా అమ్మకం ధర చదరపు అడుగుకు సుమారు రూ.1.38 లక్షలుగా ఉండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిదర్శనం. ఈ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు పై అంతస్తులు, వెనుక భాగంలో అదనపు నిర్మాణం ఉన్నాయి. ఇది దక్షిణ ముంబై నడిబొడ్డున విశాలమైన ఎస్టేట్‌గా ఉంది.కొత్త ఓనర్లకు అంబానీతో లింక్ఈ ప్రతిష్టాత్మక లక్ష్మీ నివాస్ బంగ్లాను ఇప్పుడు అంబానీ కుటుంబానికి చెందిన వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తన కీలక వాటాదారుల ద్వారా సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఎలీనా నిఖిల్ మేస్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి అయిన నిఖిల్ మేస్వానీ సతీమణి. ఇక ఈ నిఖిల్ మేస్వానీ ఎవరో కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మేస్వానీ కుమారుడు. ఈయన ధీరూభాయ్ అంబానీ అక్క త్రిలోచన మేనల్లుడు.
ఫ్యామిలీ

World Poetry Day 2025 : పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే!
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ. 1999లో పారిస్‌లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్‌లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్‌గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవితమనసుకు అలసటతో చెమట పట్టినపుడోదేహంలోని నెత్తురు మరిగినపుడోగొంతు అక్షరాల సాయం తీసుకుంటుందివేదన కళగా మారిసృజనాత్మకతనులేపనంగా అద్దుకుంటుందిశిశిరాలు వెంటపడిఅదేపనిగా తరుముతున్నప్పుడువసంతం కోసం చేసే తపస్సుపెనవేసుకున్న శీతగాలి ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడుతుపాన్లతో చైతన్య పరిచేదిచందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడుకళ్ళు మూసుకున్న ప్రపంచాన్నివేకువ గీతాలై నిద్రలేపేదిఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలనిఅనంతం నిండా వ్యాపించినఅక్షయం కాని అక్షర సముదాయంఒకానొక మహావాక్యమైఅద్వితీయ కావ్యమై నిలుస్తుంది.– ర్యాలి ప్రసాద్

ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు)

Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు
విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి. గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!)

సుమనోహరం వెడ్డింగ్ ట్రెండ్స్..!
పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బుక్ మార్క్ చేసుకోదగిన అతిపెద్ద ఫ్యాషన్ ట్రెండ్స్ ఈ ఏడాది మనల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయం, ఆధునిక ధోరణులను కలబోసి మన ముందుకు తీసుకువచ్చాయి. వధువుల కోర్సెట్ చోళీలు, భారతీయ సంప్రదాయ నేత చీరలు, పలుచటి మేలి ముసుగులు, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా కనిపించాయి. పెళ్ళిళ్లకు ముందే బుక్ మార్క్ చేసుకోదగిన పెళ్లికూతురుట్రెండ్స్లో ప్రధానంగా కనిపించిన జాబితాను చెక్ చేద్దాం..భారతీయ చేనేతక్లాసిక్ ఇండియన్ చేనేత పునరుజ్జీవనాన్ని మనం గమనించి తీరాలి. వివాహ వేడుకలకు కాంజీవరం, బనారసి, చికంకారి వంటి చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలాతీత డిజైన్లు సంప్రదాయ రూపంలో ధరించినా లేదా ఆధునిక ట్విస్ట్‌తో మెరిపించినా, ఇవి మసకబారే సూచనలు కనిపించడం లేదన్నది నిజం.కోర్సెట్లు ఫ్యాషన్ రంగాన్ని ఆక్రమించాయి అని చెప్పవచ్చు. వీటిని సంప్రదాయ వివాహ వేడుకలకు తీసుకురావడం ఎలా అనే అంశంపై పెద్ద కసరత్తే జరిగింది. అందుకు పెళ్లికూతుళ్లు కూడా తమ వివాహ సమయంలో ఆధునికంగా కనిపించడానికి కోర్సెట్ చోళీలను ఎంచుకుంటున్నారు. దాంతో దిగ్గజ డిజైనర్లు తమ డిజైన్స్‌కు ఆధునికతను జోడిస్తున్నారు. సాంప్రదాయ పెళ్లి బ్లౌజ్లకు ఇవి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. ఫిష్‌టైల్ లెహంగాతో కోర్సెట్ చోళీలు జతగా చేరి అద్భుతంగా కనిపిస్తున్నాయి. సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు కోర్సెట్లు అంతటా రాజ్యమేలుతున్నాయి.లాంగ్ వెయిల్స్పాశ్చాత్య వివాహాల నుంచి వీటిని స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వధువులలో ట్రైల్ లేదా వెయిల్ ఉన్న లెహంగాలను ధరించే ధోరణి పెరుగుతోంది. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకునే వధువులకు ఈ లుక్ ఒక గొప్ప ఎంపిక. లాంగ్ ట్రైల్స్ లేదా వెయిల్స్ ఉన్న లెహంగాలు ప్రిన్సెస్ లుక్‌తో అందంగా కనిపిస్తాయి. (చదవండి: 'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!)
ఫొటోలు
International

మిత్ర దేశమే..కానీ టారిఫ్‌లే
వాషింగ్టన్: ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ, ఇండియాలో టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి టారిఫ్‌లు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు.ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులపైనా తాము అలాంటి చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అమెరికా–ఇండియా సంబంధాలపై చర్చించారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలను క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఆ విధంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఇండియాలో అమెరికా ఉత్పుత్తులపై ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో ఏప్రిల్ 2 నుంచి ఇండియా ఉత్పత్తులపై తమ దేశంలో అలాంటి టారిఫ్‌లే అమల్లోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్–ఎకనామిక్ కారిడార్(ఐమెక్)ను సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పారు. వ్యాపారం, వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. తమ శత్రువులను మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. వారికి ఎలాంటి మర్యాద చేయాలో తమకు బాగా తెలుసని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతామన్నారు.

భారత్‌పై ‘ఎక్స్’ పిటిషన్
బెంగళూరు: చట్ట వ్యతిరేక కంటెంట్, సెన్సార్ షిప్ పేరుతో భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి ముఖ్యంగా సెక్షన్ 79(3)(బీ) విషయంలో 2015 నాటి శ్రేయా సంఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని, ఆన్లైన్లో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. జ్యుడీషియల్ ప్రక్రియకు లోబడి కంటెంట్‌ను బ్లాక్ చేయడం లేదా సెక్షన్ 69 ఏ ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్న నిబంధనలను భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొంది.కాగా, ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా కోర్టు ఉత్తర్వుతో అక్రమ కంటెంట్‌ను ఆన్లైన్ వేదికలు తొలగించడం తప్పనిసరని ఐటీ చట్టంలోని 79(3)(బీ) చెబుతోంది. 36 గంటల్లోగా ఆ విధంగా చేయకుంటే, సంబంధిత వేదికలకు సెక్షన్ 79(1) ప్రకారం రక్షణలను కోల్పోతుంది. ఐపీసీ తదితర చట్టాల ప్రకారం ఆ వేదికలపై చర్యలు తీసుకునే అవకాశమేర్పడుతుంది. అయితే, ఈ నిబంధనను వాడుకుంటూ స్వతంత్రంగా కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నది ఎక్స్ వాదన.తగు ప్రక్రియను అనుసరించకుండా అధికారులు ఏకపక్షంగా కంటెంట్ సెన్సార్ షిప్ విధిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అదేవిధంగా, సామాజిక మాధ్యమ వేదికలు, పోలీసులు, దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం కోసం హోం శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సహయోగ్ పోర్టల్‌ను ఎక్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపరమైన సమీక్ష లేకుండానే ఫలానా కంటెంట్‌ను తొలగించాలంటూ ‘సహయోగ్’నేరుగా తమపై ఒత్తిడి చేస్తోందని కూడా ‘ఎక్స్’అంటోంది.

భారత్ కన్నా పాలస్తీనా, ఉక్రెయిన్ వెరీ వెరీ హ్యాపీ
వాషింగ్టన్/ లండన్: రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనాసరే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ముందుకుసాగే పౌరులున్న దేశంలో నిరంతరం ఆనందం వెల్లివిరుస్తుంది. ఫిన్లాండ్లో ప్రజలు ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గురువారం విడుదలైన ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక–2025లో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.నంబర్‌వన్ ర్యాంక్‌ను ఫిన్లాండ్ సాధించడం ఇది వరసగా ఎనిమిదోసారి కావడం విశేషం. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 118వ ర్యాంక్ సాధించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సి టీలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వార్షిక నివేదికను రూపొందించారు. ఆయా దేశాల పౌరుల ఆదాయాల వ్యయాలు, వృద్ధి మాత్రమే కాకుండా వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు, పరస్పర నమ్మకం, సామాజిక మద్దతు, ఆత్మ సంతృప్తి, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దానగుణం, అవినీతి స్థాయి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఈ నివేదికకు తుదిరూపునిచ్చారు.మీ జీవితాలకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? వంటి విభిన్నమైన ప్రశ్నలకు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రజల సమాధానాలు రాబట్టి నివేదికను తయారుచేశారు. విశ్లేషణ సంస్థ గాలప్, అమెరికా సుస్థిరాభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్‌లతో కలిసి ఈ నివేదికను సిద్ధంచేశారు. అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఈ జాబితాను విడుదల చేశారు.భారత్ కంటే మెరుగైన స్థానంలో పొరుగుదేశాలుగత ఏడాది 126వ ర్యాంక్‌తో పోలిస్తే భారత్ ఈసారి మెరుగ్గా 118వ ర్యాంక్ సాధించింది. అయితే భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు అంతకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. చైనా 68వ ర్యాంక్, నేపాల్ 92 ర్యాంక్, పాకిస్తాన్ 109వ ర్యాంక్ సాధించాయి. యుద్ధంలో మునిగిపోయిన పాలస్తీనా ప్రాంతం, ఉక్రెయిన్ సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంక్‌లు పొందటం విశేషం. పాలస్తీనా ప్రాంతం 108వ ర్యాంక్, ఉక్రెయిన్ 111వ ర్యాంక్ సాధించాయి. అయితే శ్రీలంక 133వ ర్యాంక్, బంగ్లాదేశ్ 134వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి. బ్రిటన్‌కు 23 ర్యాంక్ దక్కింది. మొత్తం జాబితాలో అఫ్గానిస్తాన్ చిట్టచివరన నిలిచింది. గత ఏడాది అఫ్గానిస్తాన్‌కు 143వ ర్యాంక్ వస్తే ఈఏడాది 147వ ర్యాంక్ వచ్చింది.అమెరికాకు 24వ ర్యాంక్ప్రపంచ పెద్దన్నగా అన్ని దేశాలపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందిగానీ ఆ దేశ ప్రజలు ఆనంద విషయంలో అంతేస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోలేకపోయారు. అమెరికా కేవలం 24వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 13 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న అమెరికా ఇçప్పుడు 24వ ర్యాంక్‌కు పడిపోయింది.ఇక హమాస్ యుద్ధంతో ఇజ్రాయెల్ పౌరులు విసిగిపోయారని వార్తలొస్తున్నా వ్యక్తిగత, సమాజ జీవితంలో వాళ్లు మెరుగ్గా ఉన్నారని నివేదిక ప్రకటించింది. జాబితాలో ఇజ్రాయెల్ 8వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్ (5), కోస్టారికా (6), నార్వే (7), ఇజ్రాయెల్ (8), లక్సెంబర్గ్ (9), మెక్సికో (10) తొలి 10 ఆనందమయ దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కోస్టారికా, మెక్సికోలు టాప్– 10లో నిలవడం ఇదే తొలిసారి.

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం(Israeli army).. గాజాపై విధ్వంసకర దాడితో విరుచుకుపడింది. ఈ దాడిలో 70 మందికిపైగా ప్రజలు మృతిచెందివుంటారని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం గాజాలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి బుధవారం రాత్రి మొదలై గురువారం ఉదయం వరకు కొనసాగింది.ఈ భకర దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజాకు చెందిన వైద్యులు గురువారం ఈ సమాచారాన్ని మీడియాకు అందించారు. దక్షిణ గాజా పట్టణాలైన ఖాన్ యూనిస్, రఫా, బీట్ లాహియాలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వైద్యులు తెలిపారు. అయితే మొత్తం మరణాల సంఖ్య ఎంత అనేదీ వెల్లడించలేదు. అయితే ఉత్తర, దక్షిణ గాజాలో ఈ తెల్లవారుజామున జరిగిన దాడిలో 70 మందికి పైగా ప్రజలు మృతిచెందినట్లు అల్ జజీరా(Al Jazeera) వెల్లడించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ వారం రోజుల క్రితం విచ్ఛిన్నమైంది. నాటి నుండి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్.. గాజాపై భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా జనం మరణించారు. తమ బందీలను విడుదల చేయనందుకు హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో హమాస్‌పై భారీ దాడులు చేయాలంటూ తమ సైన్యాన్ని ఆదేశించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర , దక్షిణ గాజాలో దాడులకు దిగుతోంది. ఇది కూడా చదవండి: Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్ ఆగ్రహం
National

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు శాలరీ డబుల్..!
బెంగళూరు: హనీ ట్రాప్ అంశం ఓవైపు కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈరోజు(శుక్రవారం) ఓ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం, ఎమ్మెల్యేల శాలరీని వంద శాతం హైక్ చేసే బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రూ. 10 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. తాజా శాలరీ హైక్ బిల్లు ఆమోదంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతం భారీగా పెరగనుంది. ప్రస్తుతం కర్ణాటక సీఎం జీతం రూ. 75 వేలు ఉండగా, అది ఇప్పుడు రూ. 1 లక్షా యాభై వేలకు చేరనుంది. ఇక మంత్రుల జీతం 108 శాతం హైక్ తో రూ. 60 వేల నుంచి లక్షా పాతికవేలకు చేరింది.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం రూ. 40 వేల నుంచి రూ. 80 వేలకు చేరనుంది.ఇక వీరందరికీ వచ్చే పెన్షన్ కూడా పెరగనుంది. రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు వీరికి పెన్షన్ లభించనుంది.దీనిపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. శాలరీ వంద శాతం హైక్ చేయడాన్ని సమర్థించారు. సామాన్యుడు ఎలా ఇబ్బందులు పడతాడో చట్ట సభల్లో ఉన్న తాము కూడా అలానే ఇబ్బందులు పడతామనే విషయం గ్రహించాలన్నారు. దీనికి సంబంధింంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు పరమేశ్వరన్. బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.. సస్పెన్షన్ఈరోజు చర్చకు వచ్చిన అంశాలతో పాటు పల్లు బిల్లులకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారుఆగ్రహంతో స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్ ముఖంపైకి విసిరి కొట్టారు. దాంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ కు గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీని మళ్లీ కుదిపేసిన హనీ ట్రాప్

Karnataka : అసెంబ్లీలో గందరగోళం.. 18 మంది ఎమ్మెల్యేలపై వేటు
బెంగళూరు: హనీ ట్రాప్ (honey trap) దుమారంతో కర్ణాటక (Karnataka) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హనీట్రాప్ అంశంపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన 18 మంది బీజేపీ (bjp) ఎమ్మెల్యేలపై స్పీకర్ యుటి ఖాదర్ సస్పెన్షన్ వేశారు. కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించింది. అయితే, ఆ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హనీట్రాప్‌పై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హనీట్రాప్‌ను డైవర్ట్ చేసేందుకు ముస్లిం రిజర్వేజన్ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారని ఆరోపణలు గుప్పించారు అంతేకాదు, హనీట్రాప్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పేపర్లను చించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ ముఖంపై విసిరేశారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేపర్లు చించి బీజేపీ ఎమ్మెల్యేలపై విసరడంతో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. సభ నుంచి 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు.

ఆ రోజులు పోయాయి.. ఉగ్రవాదంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానం ఇస్తూ.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా.. గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని అమిత్ షా వివరించారు.

ఆ తీర్పు ముమ్మాటికీ తప్పే!: కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళలను అభ్యంతకరంగా తాకడం లైంగిక దాడి కిందని రాదంటూ ఓ మైనర్ బాలిక కేసులో ఆయన తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే తీర్పు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని అంటున్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి. అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న మంత్రి అన్నపూర్ణ.. దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..?2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన మైనర్ కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన.
NRI

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.

న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న వార్తలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి. ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు ఈ ఇమ్మిగ్రేషన్ సెమీనార్‌కు ముఖ్యవక్తలుగా విచ్చేసి అనేక కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జన్మత:పౌరసత్వం, హెచ్ ఒన్ బీ నుంచి గ్రీన్ కార్డు వరకు అనుసరించాల్సిన మార్గాలు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్4 వీసా ఇలాంటి ఇమ్మిగ్రేషన్ అంశాలపై భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సెమీనర్లో పాల్గొన్న వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఇమ్మిగ్రేషన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ సెమీనార్ నిర్వహణ కోసం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల కృషి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సెమీనార్‌కు విచ్చేసిన భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలకు నాట్స్ నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ సెమీనార్ విజయవంతం కావడంలో శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరి కీలక పాత్రలు పోషించారు. తెలుగు వారికి ఎంతో ఉపయుక్తమైన ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ టీంను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.

టంపా వేదికగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఏర్పాట్లు
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి టంపా వేదికగా జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా నిర్వహిస్తున్నట్టు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రం టంపాలోని టంపా కన్వెన్షన్ సెంటరు వేదికగా జరగనున్న ఈ తెలుగు సంబరాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నలుమూలల నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని, తెలుగువారి సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇప్పటికే ఏడు సార్లు ప్రతి రెండేళ్లకు అమెరికా సంబరాలను అద్భుతంగా నిర్వహించిందని.. ఈ సారి 8వ అమెరికా తెలుగు సంబరాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. తెలుగు వారిని అలరించే ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదాల సమాహారాలు ఈ సంబరాల్లో ఉంటాయని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు. సంబరాల నిర్వహణ కమిటీ లను ఎంపిక చేశామని, 3లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటరులో ఈ సంబరాల నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని నాట్స్ పేర్కొంది. రోజుకి 10 వేలకు పైగా ప్రవాస అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారనే అంచనాలతో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కోసం ఆ స్థాయిలో విజయవంతానికి నాట్స్ సంబరాల కమిటీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది.(చదవండి: జర్మనీ పాఠ్యాంశాల్లో తెలుగు విద్యార్థి ప్రస్థానం)
క్రైమ్

ఆటోను ఢీ కొట్టిన లారీ.. మహిళా కూలీల పరిస్థితి విషమం
మహబూబాబాద్, సాక్షి: నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహిళా కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మిర్చి తోట ఏరడానికి బంగ్లా వైపు ఆటోలో వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో మూడు ఆంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా.. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మందలించాడని తండ్రిని హత్య చేసిన కూతురు
మండపేట: తనను మందలించాడన్న కోపంతో ఓ మహిళ ప్రియుడి సహాయంతో కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను గురువారం టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు వెల్లడించారు. 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన దుర్గ కన్న తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతను తోడుగా తన స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు. మృతుడి సోదరుడు సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ.. దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి.. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు.

Hyderabad: లక్కీ భాస్కర్ కాదు ఇక్కడ .. మగ్గం వర్క్ ఆదిలక్ష్మి ..!
హైదరాబాద్: అధిక డబ్బులు, ఉద్యోగాల ఆశచూపింది. అందినకాడికి దండుకుంది. తేరుకున్న బాధితులు ప్రశ్నించడంతో తాను రిటైర్డ్ పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. చివరకు ఆ కిలాడీ లేడీ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే కంగుతినాల్సి వచ్చింది.చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి ఐజీ మింట్, గణేష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఆలియాస్ శ్రీదివ్యకాలనీలో మగ్గం వర్క్ చేసుకుంటూ కూమర్తెతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన వద్దకు మగ్గం వర్క్ కోసం వచ్చే మహిళలను మచ్చిక చేసుకుని వారికి మాయమాటలు చెప్పి బుట్టలోకి దించింది. రూ.1000 కడితే వారంలో రూ.10వేలు ఇస్తానని, రూ.లక్ష ఇస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి గంటల వ్యవధిలో రూ.20–25 వేలు అధికంగా ఇస్తానంటూ.. నమ్మబలికి సుమారు 100 మంది మహిళల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అనుమానం వచ్చి అడిగితే దాటవేస్తూ.. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మొండికేసింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తాను రిటైర్డు పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువించకపోవడం గమనార్హం. పలు కేసుల్లో నిందితురాలు.. తోటి మహిళలను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకున్న కిలాడీ లేడిని చర్లపల్లి పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు, మరోస్టేషన్లో ఇంకో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించడం లేదు.. సదరు నిందితురాలి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నా పోలీసులకు సహకరించడం లేదని, పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. మేడిపల్లిలో మగ్గం మిషన్ల కొనుగోళ్లపై అవినీతికి ఆమె పాల్పడిందని, ఈ కేసులో కూడా నిందితురాలని తెలుస్తోంది.