
Rani Mukherjee- Beauty Secrets: ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే నటీమణుల్లో రాణి ముఖర్జీ ఒకరు. యోగాతో పాటు కార్డియో ఎక్సర్‌సైజులు చేస్తానంటూ గతంలో వెల్లడించారామె. రోజుకు గంటకు పాటు వర్కౌట్లకు వెచ్చించే రాణికి ఆరోగ్యంతో పాటు సౌందర్య స్పృహ కూడా ఎక్కువే. అయితే, అందరిలా కృత్రిమ పద్ధతులు కాకుండా అమ్మ చెప్పిన చిట్కాలు పాటిస్తూ అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నట్లు తన సౌందర్య రహస్యాలు పంచుకున్నారు 44 ఏళ్ల ఈ ముంబై బ్యూటీ.
‘‘బాగా నీళ్లు తాగుతాను. నీళ్లతోపాటు అలోవెరా జ్యూస్, నిమ్మకాయ రసం, కొబ్బరి నీళ్లు, జీరా వాటర్.. తప్పకుండా తీసుకుంటా. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపించి.. చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. డైట్‌లో అయితే సూప్స్, సలాడ్స్, ఉడికించిన కూరగాయలే ఉంటాయి ఎక్కువ శాతం.
ఇవన్నీ నన్ను చురుగ్గా, ఉత్సాహంగా, అందంగా ఉంచుతాయి! అమ్మ చెప్పిన చిట్కాలు కదా మరి!’’ అని రాణి ముఖర్జీ తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేశారు. కాగా నిర్మాత ఆదిత్య చోప్రాను రాణి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ కూతురు సంతానం.
చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే!
Allu Arjun Wife Sneha Reddy: చీరకట్టులో కుందనపు బొమ్మలా అల్లు స్నేహారెడ్డి! ఆ సారీ ధర ఎంతంటే!