Devotion: పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? | Sakshi Plus Devotional Stories And Suggestions | Sakshi
Sakshi News home page

Devotion: ధర్మసందేహాలు..!

Published Thu, Aug 29 2024 10:34 AM | Last Updated on Thu, Aug 29 2024 10:34 AM

Sakshi Plus Devotional Stories And Suggestions

పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? –  డి. వరలక్ష్మి, హైదరాబాద్‌
కావాలని కుళ్లిన కొబ్బరికాయని మనం తేలేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మరో కొబ్బరికాయని తేగల అవకాశం అప్పుడుంటే సరే సరి. మరోసారి పూజకి కూర్చున్నప్పుడు ఈ కొబ్బరికాయకి బదులుగా మరో కొబ్బరికాయని కొడితే సరి. పూజ లోపానికీ కొబ్బరికాయ కుళ్లడానికీ సంబంధం లేదు.

రాహుకాల దీపం గురించి చెప్పగలరు.. – అప్పారావు, సాలూరు
– జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని  రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చెయ్యాలి.

గృహంలో వాస్తుదోష పరిహారానికి ఏం చెయ్యాలి? – ఆర్‌. కౌసల్య, చిల్కమర్రి
– వాస్తు దోష పరిహారం కోసం గృహప్రవేశం రోజున ‘వాస్తుహోమ’మంటూ ఒకదాన్ని చేస్తారు. దోషం తప్పనిసరిగా ఉన్న పక్షంలో మత్స్యయంత్రం, కూర్మయంత్రం వేస్తారు. ఏది వేసినా ఇంట్లో నిత్యపూజ జరిగితే దోషం ఏమీ చెయ్యదు. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు నిరూపించిన సత్యం.

ప్రయాణంలో చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? – పార్వతి, హైదరాబాద్‌
– ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్‌ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది) అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు.

మరణానంతరం నా శరీరాన్ని ఉచితంగా వైద్య కళాశాలకి ఈయదలిచాను. పిల్లలు అంగీకరించడం లేదు..? – ఒక పాఠకురాలు, హైదరాబాద్‌
– మీరు జీవించినంతసేపే మీ శరీరం మీద మీకు హక్కు. మీ పిమ్మట ఆస్తిపాస్తులతోపాటు పార్థివ శరీరమ్మీద అధికారం కూడా పిల్లలకే ఉంటుంది. వాళ్లు అంగీకరించనప్పుడు ఇవ్వడం భావ్యం కాదు. చివరి కాలంలో పిల్లలతో విరోధించడమూ సరికాదు.

60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా? – శ్రీనివాస్, విజయనగరం
– ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభి్రపాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు.

ఇవి చదవండి: సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement