'ప్రకృతి పండగ సంబరంగా జరుపుకోవాలంటే ఆ కళ కూడా మన ఇంటికి కొత్త కళాకాంతులు తీసుకురావాలి. అప్పుడే పండగ మరింత అందంగా, శోభాయమానంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి కొన్ని సంక్రాంతి అలంకరణలు ఇవి.'
సంక్రాంతి, పొంగల్ ఈ రెండింటినీ హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున, ఇళ్లను అందంగా అలంకరించడానికి పోటీపడుతుంటారు. సంప్రదాయ పద్ధతులే కాకుండా, పొంగల్ లేదా మకర సంక్రాంతికి ఇంటిని అలంకరించుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటిలో ఇంటీరియర్ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు..
రంగుల రంగోలి
ఏ భారతీయ పండుగకైనా ఇంటి ముందు అందమైన రంగోలీ ముచ్చటగొలుపుతుంది. ముగ్గుల పండగగా పేరొందిన సంక్రాంతికి ఇంటి గుమ్మం వద్ద, పూజ గది, పొంగల్ కోసం బయట రంగోలి డిజైన్‌లను రూపొందించడానికి మీ సృజనాత్మకతను చూపచ్చు. అందరూ వేసేదిగా కాదు అనుకుంటే వినూత్నమైన డిజైన్‌లను ప్రయత్నించవచ్చు. దీంతో పొరుగువారిని మించిపోవచ్చు.
అపార్ట్‌మెంట్‌ల కోసం ఇన్‌డోర్..
అందరూ అలంకరించుకోవడానికి విశాలమైన పచ్చికతో కూడిన పెద్ద బంగ్లాలలో నివసించరు. అనేక మంది పట్టణవాసులు పట్టణాలు, నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారు. కానీ ఇన్‌డోర్ డెకరేషన్ అవుట్‌డోర్‌లో చేసినట్లే ఆహ్వానించదగినదిగా ఉంటుంది. మీ గదిని ఆకులతో పొడవాటి చెరకుతో అలంకరించండి. బియ్యం పాలు, బెల్లం ఉడకబెట్టడాన్ని సూచించే మట్టి కుండలతో అలంకరించండి. సంక్రాంతి లేదా పొంగల్ జరుపుకోవడానికి మీకు పెద్ద బాల్కనీ లేదా తోట అవసరం లేదని గ్రహించాలి.
ఆకులతో అందంగా..
పొంగల్, సంక్రాంతి అనేది శ్రేయస్సు వేడుక, ఈ థీమ్‌లో ఆకుపచ్చ రంగుదే అగ్రతాంబూళం. అందుకని, పొంగల్ రోజున మామిడి ఆకుల తోరణాలను ఇంటి ప్రవేశద్వారం వద్ద వేలాడదీయడం శుభప్రదమైనది. రంగు రంగు కాగితాలను ఉపయోగిస్తూ చేతితో పర్యావరణ అనుకూలమైన అలంకరణ చేయచ్చు.
థీమ్ డెకరేషన్‌లో గాలిపటం
గాలిపటాల హంగామా ఈ పండగ ప్రత్యేకం. కాబట్టి, పేపర్ క్రాఫ్ట్‌తో రంగురంగుల గాలిపటాల తయారీ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకు వస్తుంది. వీటిని తయారు చేయమని పిల్లలను ప్రోత్సహించవచ్చు. వాల్ హ్యాంగింగ్‌లను అందమైన అలంకరణలుగా ప్రయత్నించవచ్చు. కాగితంతో తయారు చేసిన సీతాకోకచిలుకలు, పువ్వులు, జంతువుల బొమ్మలు ఇంటీరియర్‌కు అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. మార్కెట్‌లో కూడా గాలిపటాలు అన్ని ఆకారాలు, పరిమాణాలలో లభిస్తాయి. బాల్కనీ అయితే గాలిపటాలను వేలాడదీయవచ్చు. లివింగ్ రూమ్‌లోని ఓ వాల్‌ని ఎంచుకుని రంగు రంగుల గాలిపటాలతో ఆకర్షణీయమైన అలంకరణ కోసం అతికించవచ్చు. వీటికి పువ్వులు, చెరకు డిజైన్‌లను కూడా జోడించవచ్చు.
వాల్ పేపర్స్
పొంగల్ అలంకరణ చిటికేసినంత సులువుగా నట్టింటికి రావాలంటే ఇప్పుడు అందమైన ఫెస్టివల్ వాల్ పేపర్లు, వాల్ డెకార్ బ్యాక్‌డ్రాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన వాల్‌పేపర్‌ని ఎంచుకొని, డెకార్ చేయడమే తరువాయి.
పండగ పిండివంటలు
ఒక టేబుల్‌పైన కాగితం లేదా చెక్కతో తయారుచేసిన ఎడ్ల బండ్ల బొమ్మలు, అరిశెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు.. వంటివి పలహారాల పేట్లు, కొయ్య బొమ్మలను ఉంచితే చాలు పండగ కళ వచ్చేసినట్టే.
ఇవి చదవండి: 'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..
Comments
Please login to add a commentAdd a comment