
యాక్ట్రెస్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె హోమ్ టౌన్ ముంబై. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మ్యూజిక్ వీడియోస్‌లో కూడా పర్‌ఫార్మ్ చేసింది. 2017లో తన పేరుతోనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసింది. వ్లాగ్స్, మేకప్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటుంది.
ఆమె చానల్‌కు దాదాపు యాభై లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. లిప్ సింక్ వీడియోలతో జన్నత్ టిక్‌టాక్‌లోనూ పాపులర్ అయింది. మన దగ్గర టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ అందులో ఫేమస్ అయిపోయింది. ఆమె ఇన్‌స్టాకి దాదాపు అయిదుకోట్లకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌కి తెలియజేయడానికి "Jannat Zubair Rahmani Official" అనే యాప్‌నీ లాంచ్ చేసింది జన్నత్. ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment