ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? | Sri Kalahastiswara Satakam In Telugu Special Devotional Story | Sakshi
Sakshi News home page

ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు?

Published Thu, Feb 18 2021 7:01 AM | Last Updated on Thu, Feb 18 2021 10:10 AM

Sri Kalahastiswara Satakam In Telugu Special Devotional Story - Sakshi

రాజుల్మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు, వారిచ్చు నం             
భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా     
బీజంబుల్, తదపేక్షచాలు, పరితృప్తింపొందితిన్, జ్ఞానల     
క్ష్మీజాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!        
     
భావం: శ్రీకాళహస్తీశ్వరా! రాజులు గర్విష్ఠులు. వారిని ఆశ్రయించడం నరకంతో సమానం. ఆ రాజులిచ్చే స్త్రీలు, పల్లకీలు, గుర్రాలు, నగలు, మొదలైన కానుకలు మనస్సుకు దుఃఖం కలిగిస్తాయి. ఈ రాజులసేవ ఇకచాలు!!! పొందవలసిన తృప్తినిపొందాను. ఇక నాకు నువ్వు జ్ఞానలక్ష్మీ జాగ్రదావస్థను దయతో ప్రసాదించు.     

నీరూపంబు దలంపగా తుద మొదల్నే గాన వీవైనచో             
రారా రమ్మనియంచు చెప్పవు, వృధారంభంబు లింకేటికిన్‌           
నీరన్ముంపుము పాలముంపుమిక నిన్నేనమ్మినాడంజుమీ
శ్రీరామార్చితపాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా !                 

భావం: శ్రీకాళహస్తీశ్వరా!  నీ రూపాన్ని తలచుకోవాలంటే, దాని తుద, మొదలు తెలియని  అశక్తుడను. పోనీ, నీవైనా నామీద దయతలచి నన్ను రమ్మని పిలవవు. ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? నిన్నే నమ్ముకున్నాను. నీట ముంచుతావో, పాలముంచు తావో, అది ఇక నీదయ!  

తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement