మాయా లేదు.. మంత్రం లేదు, వాళ్లంతే : అయితేనేం..! | Success Story of Indian Conjoined Twins Sohna Singh And Mohna Singh | Sakshi
Sakshi News home page

మాయా లేదు.. మంత్రం లేదు, వాళ్లంతే : అయితేనేం..!

Published Sat, Mar 16 2024 3:52 PM | Last Updated on Sat, Mar 16 2024 4:35 PM

ఫోటో కర్టసీ: హ్యూమన్స్‌  ఆఫ్‌ బాంబే - Sakshi

ఆ ఇద్దిరికీ తలలు వేరు, కాళ్లు మాత్రం రెండే

సోహ్నా-మోహనా  సింగ్‌ ఇద్దరూ అవిభక్త కవలలు

ఆ ఇద్దరిదీ ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒక్కటిగానే పుట్టారు. అందరిలాగానే రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులు ఉన్నాయి.  కానీ కాళ్లు మాత్రం రెండే. అదేంటి అనుకుంటున్నారా. మన వీణా వాణిలాగా పంజాబ్‌కు చెందిన సోహ్నా-మోహనా ఇద్దరూ అవిభక్త కలలు. మరి వీరి జీవనం ఎలా సాగుతోంది?  ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారా? తెలుసుకుందాం రండి!

2003, జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపలానీ హాస్పిటల్‌లో జన్మించారు ఈ ‍ కవలలు.  డెలివరీ చేసిన డాక్టర్‌ కూడా వీరిని చూసి విస్తుపోయారు. చాలా అరుదైన పరిస్థితిలో వీరు జన్మించారు. శరీరంలోని పై భాగం అంతా విడి విడిగానే ఉంటుంది. కానీ తుంటినుంచి దిగువ భాగంమాత్రం కలిసిపోయింది. పిత్తాశయం, ప్లీహము ఒకటే. అలాగే ఇద్దరికీ కలిపి రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. 

ఈ పిల్లల తండ్రి సుర్జిత్ కుమార్ టాక్సీ డ్రైవర్. వారికి అప్పటికే 3 కుమార్తెలు ఉన్నారు. దీంతో  కవల శిశువులను పోషించలేమని రెండు నెలల వయస్సులో వారిని విడిచిపెట్టారు. దీంతో వీరిని ఢిల్లీలోని AIIMకి తరలించారు. తరువాత అంటే 2003 ఆగస్టు 15న అమృత్‌సర్‌లోని షెల్టర్‌హోమ్ ఆల్ ఇండియా పింగళ్వార ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుంది. డాక్టర్ ఇందర్‌జిత్ కౌర్  చాలా ఆదరంగా పోషించడమే  కాదు,  సోహ్నా సింగ్, మోహనా సింగ్ అంటూ నామకరణం చేశారు. వీరి ఫస్ట్‌ బర్త్‌డే పార్టీని కూడా ఘనంగా  నిర్వహించారు. 

పీఎస్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు
ఐటీఐ డిప్లొమా (ఎలక్ట్రీషియన్) పూర్తి చేసిన ఈ కవలలు  పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)లో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగాలు సాధించారు.

ఇద్దరీ ఆలోచనలు వేరు, వేరు
వీరి శరీరంలో రెండు మెదళ్లు ఉన్నాయి. అందుకే నేమో  ఇద్దరికీ విలక్షణమైన వ్యక్తిత్వాలు,అభిప్రాయాలు ఉన్నాయి. సోహ్నా సింగ్  డామినేటింగ్‌గా,  చురుగ్గా  ఉంటాడు.  మోహనా సింగ్ మౌనంగా, సున్నితంగా ఉంటాడు. 

ఇద్దిరికీ ఓటు హక్కు, వేర్వేరు ఓటర్‌ ఐడీలు
సోహ్నా-మోహనా ఓటు వేశారు  వీరి ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకున్నఎన్నికల సంఘం ఇద్దరికీ వేర్వేరుగా ఓటర్‌ కార్డులను ఇవ్వడం విశేషం. అమృత్‌సర్‌లోని మనవాల్‌లో ఇద్దరు వేర్వేరు ఓటర్లుగా తొలిసారి ఓటు వేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement