క్యాన్సర్‌ థర్డ్‌ స్టేజ్‌! కానీ ఎలాంటి సర్జరీ లేకుండానే.. | UK Woman Of Deadly Third Stage Cancer Cures Wonder Drug | Sakshi
Sakshi News home page

ఓ మహిళకి క్యాన్సర్‌ థర్డ్‌ స్టేజ్‌!ఎలాంటి సర్జరీ లేకుండానే..

Published Mon, Oct 9 2023 1:09 PM | Last Updated on Mon, Oct 9 2023 1:36 PM

UK Woman Of Deadly Third Stage Cancer Cures Wonder Drug - Sakshi

క్యాన్సర్‌ స్టేజ్‌లను బట్టి రోగులకు చికిత్స అందించడం అనేది సర్వసాధారణం. కానీ కొన్ని క్యాన్సర్‌లు మొదటి స్టేజ్‌ల్లో చికిత్స తీసుకుంటేనే సులభంగా బయటపడగలుగుతారు. కొన్ని క్యాన్సర్‌లు మాత్రం ఏ స్టేజ్‌ అయినా పరిస్థితి సీరియస్‌ తప్ప క్యూర్‌ అవ్వడం అనేది ఉండదు. కానీ ఇక్కడొక మహిళ విషయంలో ఓ డ్రగ్‌ మిరాకిల్‌ చేసింది. ప్రాణాంత క్యాన్సర్‌ వ్యాధి నుంచి ఎలాంటి కీమో థెరఫీ, సర్జరీ వంటివి చేయంచుకోకుండానే సులభంగా నయం కావడమే కాదు పూర్తి స్థాయిలో క్యాన్సర్‌ సమస్య నుంచి బయటపడింది. వైద్యులను సైతం నివ్వెరపరిచింది ఈ డ్రగ్‌. ఇంతకీ ఏంటా మెడిసన్‌? ఆమెకు క్యాన్సర్‌ ఎలా క్యూర్‌ అయ్యిందంటే..

వివరాల్లోకెళ్తే..యూకేలోని వేల్స్‌కు చెందిన క్యారీ డౌనీ అనే మహిళకి ప్రేగు క్యాన్సర్‌ వచ్చింది. అది కూడా థర్డ్‌ స్టేజ్‌. ఆమెకు వైద్యులు వండర్‌ మెడిసిన్‌ని ఇచ్చారు అంతే జస్ట్‌ ఆరు నెలల్లో పూర్తిగా నయం అయిపోయింది. వైద్యుల కూడా ఇది మిరాకిల్‌ అంటూ ఆశ్చర్యపోయారు. ఆమెకు దోస్టార్లిమాబ్‌ అనే డ్రగ్‌ని ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చారు. ఇది యాంటీబాడీస్‌కి సంబంధించిన ఔషధం. ఇది క్యాన్సర్‌ కణాలలో నిర్దిష్ట ప్రోటీన్‌ చర్యను నిరోధిస్తుంది. అంతేగాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్‌కణాలకు వ్యతిరేకంగా పోరాడేల క్యాన్సర్‌ కణితి పెరుగుదలను నియంత్రిస్తుంది.

ఈ డ్రగ్‌ కారణంగా పెద్దగా ఎలాంటి దుష్పరిణామాలను సదరు మహిళ ఎదుర్కొనలేదు. కొద్దిగా శరీరంపై అక్కడక్కడ దద్దుర్లు వచ్చినా.. అవి కూడా త్వరితగతిన తగ్గిపోయాయి. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఇది క్లినికల్‌ ట్రయల్‌ డ్రగ్‌ అయినప్పటికీ సానుకూల ఫతితాలని ఇచ్చింది. ఒకరకంగా క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నప్పుడు పేషెంట్స్‌ చాలా రకాల దుష్పరిణామాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ వల్ల ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది అవేమీ చేయించుకోనక్కర్లేకుండా నయం కావడం నిజంగా అద్భుతం అని వైద్యులు అంటున్నారు.

పైగా ప్రేగ్లుల్లో క్యాన్సర్‌ కణితి థర్డ్‌ స్టేజ్‌(మూడో దశ)లో ఉంది. ఈ స్టేజ్‌లో ఉండగా నయం కావడం కాస్త రిస్క్‌తో కూడినదే. కానీ ఈ వండర్‌ డ్రగ్‌ అద్భుతంగా పనిచేయడమే కాక భవిష్యత్తులో రోగులు ఎలాంటి సర్జరీల జోలికి వెళ్లాల్సిన పనిలేదనే కొత్త ఆశని రేకెత్తించింది. సదరు మహిళకు కేవలం ఆరు నెలల్లోనే క్యాన్సర్‌ కణితి తగ్గిపోయిందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ప్రేగు క్యాన్సర్‌ ఉన్న రోగులకు వారానికి మూడుసార్లు చొప్పున ఇంట్రావీనస్‌గా ఇవ్వడం జరగుతుందన్నారు.

ప్రతిసారి ఇంజక్షన్‌ ఇచ్చేటప్పుడూ కనీసం అరగంట సమయం పడుతుంది. పైగా పేషెంట్‌ని పూర్తి వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచి స్కాన్లు నిర్వహిస్తూ.. ఆ డ్రగ్‌ పనితీరుని అంచనా వేయాల్సి ఉంటుందని డాక్టర్‌ బారిటన్‌ తెలిపారు. సదరు మహిళ తనకు జీవించేలా మరో అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్‌ బారిటన్‌ వైద్య బృందానికి ఎంతగానో రుణపడి ఉంటానని ఉద్వేగంగా చెప్పింది. గతేడాది బారిటన్‌ వైద్య బృందం ఇదే డ్రగ్‌ని మల క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 రోగులపై క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించి పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యారు. నిజంగా క్యాన్సుర్‌ రోగుల పాలిట ఈ మెడిసిన్‌ ఓ గొప్ప అద్భుత వరం!.

(చదవండి: ఫైబ్రాయిడ్స్‌ వల్ల హిస్టరెక్టమీ వస్తుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement