What Happens After Death: చాలామంది శాస్త్రవేత్తల్ని వేధిస్తున్న ప్రశ్నే మరణం తర్వాత ఏం జరుగుతుంది. దీని గురించి ఎంతోమంది వేల యేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అదొక అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది. అయినప్పటికీ నాటితరం శాస్త్రవేత్తల నుంచి ఇప్పటి పరిశోధకుల వరకు..అందరి మదిని తొలిచే గమ్మత్తైన ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్పగలనంటున్నాడు యూఎస్‌కి చెందిన ఓ శాస్త్రవేత్త. అందుకోసం ఎన్నో మరణాలపై పరిశోధనలు కూడా చేశారంటా!. అంతేకాదు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఆధారాలతో సహా నర్మగర్భంగా చెబుతున్నాడు.
మానవుల జీవితంలో మరణం అనేది అత్యంత లోతైన అర్థంకాని రహస్యం. మనలో చాలామంది మరణం తర్వాత ఏమవుతుందో అనే ఆలోచిస్తుంటారు కూడా. ఇదే ప్రశ్నకు సమాధానం కోసం దాదాపు 5 వేల మరణాలపై అధ్యయనం చేశారు డాక్టర్ జెఫ్రీ లాంగ్. ఈ విషయంపై అతనికి ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించేందుకు దారితీసింది. తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశాడు. ఆయన మాత్రం మరణం తర్వాత నిస్సందేహంగా జీవితం ఉంటుందని విశ్వసిస్తున్నారు.
వైద్యపరంగా మరణించిన వ్యక్తి గుండె చప్పుడు లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసే, వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని, జీవులతో సంభాషిస్తారని కూడా అంటున్నారు. ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డీఈలో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కన్‌క్ల్యూజన్‌కి రావడం విశేషం. దాదాపు 45 శాతం మంది శరీరానికి వెలుపల అనుభవం గురించి నివేదించినట్లు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్ప్రుహ నుంచి వేరుచేయబడి.. వెంటనే వారిచుట్టూ ఏం జరుగుతుందో చూడటానికి, వినడానికి వీలుంటుందని, ఆ శరీరం పై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతుంటారని అన్నారు.
చాలా మంది పరిశోధకులు ఇదే అంశాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. శరీరం వెలుపల అనుభవం వచ్చిన తర్వాత మరోచోటుకి వెళ్లిపోతారని ప్రజలు కథలు కథలుగా చెబుతుంటారు. మరికొందరూ సొరంగం గుండా వెళ్లతారని, ప్రకాశవంతమైన కాంతిని అనుభవిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి వారు శరీరం నుంచి వేరు చేయబడిన వెంటనే తమ ప్రియమైన వారిని, తమకెంతో ఇష్టమైన పెంపుడు జంతువులను పలకరిస్తారని డాక్టర్ లాంగ్ చెబుతున్నారు.
అందుకు ఉదాహరణగా ఓ యథార్థ సంఘటనను కూడా వివరించారు. ఓ మహిళ గుర్రపు స్వారీ చేస్తూ స్ప్రుహ కోల్పోయింది. దీంతో ఆమెను కాలిబాటనే అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఐతే ఆ తర్వాత ఆమె స్ప్రుహ వచ్చాక ఆ గుర్రపుశాల వద్ద ఏం జరిగిందో చెప్పింది. అదే టైంలో అక్కడ ఆమెతో సంభాషించని కొందరూ వ్యక్తులు ఆమె చెబుతోంది నిజమేనని అనడంతో ఆశ్చర్యపోవడం తనవంతైందని అన్నారు డాక్టర్ లాంగ్.
ఆ సమయంలో ఆమె కాన్షియస్‌లో లేకపోయినా.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పేసింది. ఇలాంటి ఎన్నో అనుభవాలను చెప్పుకొచ్చాడు గానీ, వాటన్నింటికీ శాస్త్రీయ వివరణ లేదని అంగీకరించాడు లాంగ్. మెదడు పరిశోధనను చదివాను, ఇలాంటి ఎన్నో పరిశోధనలను విశ్లేషించాను. కానీ వాటిలో ఏ ఒక్క పరిశోధన కచ్చితమైన కన్‌క్లూజన్‌ని ఇవ్వలేకపోయాయన్నారు. ఐతే డాక్టర్ లాంగ్‌తో అదే విషయంపై పరిశోధనలు చేస్తున్న ఇతర వైద్యులు కూడా అంగీకరించారు. ఏకీభవించారు.
(చదవండి: జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్ యజమాని కూతురు!)
Comments
Please login to add a commentAdd a comment