Happened
-
Bihar: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాజీపూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కావడియాత్రికులు హైవోల్టేజీ విద్యుత్ వైరు తగిలి మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి ఈ కావడి యాత్రికులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న కావడియాత్రికులంతా పహెల్జా నుండి గంగాజలాన్ని తీసుకుని, సోన్పూర్లోని బాబా హరిహరనాథ్ ఆలయానికి వెళుతున్నారు.ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎస్డీపీఓ ఓంప్రకాష్ మాట్లాడుతూ కావడియాత్రికులంతా ట్రాలీలో డీజేని తీసుకెళ్తున్నారని, ఆ డీజేకి 11 వేల వోల్టుల విద్యుత్ తీగ తగిలిందన్నారు. ఈ కారణంగానే వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారని తెలిపారు. -
మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు
What Happens After Death: చాలామంది శాస్త్రవేత్తల్ని వేధిస్తున్న ప్రశ్నే మరణం తర్వాత ఏం జరుగుతుంది. దీని గురించి ఎంతోమంది వేల యేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అదొక అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది. అయినప్పటికీ నాటితరం శాస్త్రవేత్తల నుంచి ఇప్పటి పరిశోధకుల వరకు..అందరి మదిని తొలిచే గమ్మత్తైన ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్పగలనంటున్నాడు యూఎస్‌కి చెందిన ఓ శాస్త్రవేత్త. అందుకోసం ఎన్నో మరణాలపై పరిశోధనలు కూడా చేశారంటా!. అంతేకాదు మరణం తర్వాత ఏం జరుగుతుందో ఆధారాలతో సహా నర్మగర్భంగా చెబుతున్నాడు. మానవుల జీవితంలో మరణం అనేది అత్యంత లోతైన అర్థంకాని రహస్యం. మనలో చాలామంది మరణం తర్వాత ఏమవుతుందో అనే ఆలోచిస్తుంటారు కూడా. ఇదే ప్రశ్నకు సమాధానం కోసం దాదాపు 5 వేల మరణాలపై అధ్యయనం చేశారు డాక్టర్ జెఫ్రీ లాంగ్. ఈ విషయంపై అతనికి ఉన్న అభిరుచితో ఏకంగా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించేందుకు దారితీసింది. తన పరిశోధనల అనుభవాల ఆధారంగా ఓ వ్యాసాన్ని కూడా రాశాడు. ఆయన మాత్రం మరణం తర్వాత నిస్సందేహంగా జీవితం ఉంటుందని విశ్వసిస్తున్నారు. వైద్యపరంగా మరణించిన వ్యక్తి గుండె చప్పుడు లేకుండా ఉన్న టైంలో కూడా వారు చూసే, వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని, జీవులతో సంభాషిస్తారని కూడా అంటున్నారు. ఏళ్లుగా ఆయన ఫౌండేషన్ ఎన్డీఈలో అలాంటి నివేదికలు ఎన్నో ఉన్నాయన్నారు. వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ చివరికి అందరూ ఒకేలా కన్క్ల్యూజన్కి రావడం విశేషం. దాదాపు 45 శాతం మంది శరీరానికి వెలుపల అనుభవం గురించి నివేదించినట్లు తెలిపారు. ప్రజలు మరణం సమయంలో భౌతిక శరీరం అనే స్ప్రుహ నుంచి వేరుచేయబడి.. వెంటనే వారిచుట్టూ ఏం జరుగుతుందో చూడటానికి, వినడానికి వీలుంటుందని, ఆ శరీరం పై భాగంలోనే వారు కొట్టుమిట్టాడుతుంటారని అన్నారు. చాలా మంది పరిశోధకులు ఇదే అంశాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. శరీరం వెలుపల అనుభవం వచ్చిన తర్వాత మరోచోటుకి వెళ్లిపోతారని ప్రజలు కథలు కథలుగా చెబుతుంటారు. మరికొందరూ సొరంగం గుండా వెళ్లతారని, ప్రకాశవంతమైన కాంతిని అనుభవిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి వారు శరీరం నుంచి వేరు చేయబడిన వెంటనే తమ ప్రియమైన వారిని, తమకెంతో ఇష్టమైన పెంపుడు జంతువులను పలకరిస్తారని డాక్టర్ లాంగ్ చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ఓ యథార్థ సంఘటనను కూడా వివరించారు. ఓ మహిళ గుర్రపు స్వారీ చేస్తూ స్ప్రుహ కోల్పోయింది. దీంతో ఆమెను కాలిబాటనే అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఐతే ఆ తర్వాత ఆమె స్ప్రుహ వచ్చాక ఆ గుర్రపుశాల వద్ద ఏం జరిగిందో చెప్పింది. అదే టైంలో అక్కడ ఆమెతో సంభాషించని కొందరూ వ్యక్తులు ఆమె చెబుతోంది నిజమేనని అనడంతో ఆశ్చర్యపోవడం తనవంతైందని అన్నారు డాక్టర్ లాంగ్. ఆ సమయంలో ఆమె కాన్షియస్‌లో లేకపోయినా.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పేసింది. ఇలాంటి ఎన్నో అనుభవాలను చెప్పుకొచ్చాడు గానీ, వాటన్నింటికీ శాస్త్రీయ వివరణ లేదని అంగీకరించాడు లాంగ్. మెదడు పరిశోధనను చదివాను, ఇలాంటి ఎన్నో పరిశోధనలను విశ్లేషించాను. కానీ వాటిలో ఏ ఒక్క పరిశోధన కచ్చితమైన కన్‌క్లూజన్‌ని ఇవ్వలేకపోయాయన్నారు. ఐతే డాక్టర్ లాంగ్‌తో అదే విషయంపై పరిశోధనలు చేస్తున్న ఇతర వైద్యులు కూడా అంగీకరించారు. ఏకీభవించారు. (చదవండి: జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్‌లో టాపర్‌గా పాన్‌షాప్ యజమాని కూతురు!) -
చైనాలో ఏమి జరుగుతోంది ..?
-
రామరాజ్యంలోనూ రేప్‌లు జరిగాయన్న డీజీపీ!
లక్నో: రామ రాజ్యంలోనూ రేప్ లు జరిగాయట.. మహిళలపై అత్యాచారాలు చాలా కామన్ అట.. వాటిని నిరోధించడం ఎవరివల్లా కాదట.. చివరికి పోలీసుల వల్లా కాదంటూ చెత్తులెత్తేసిన పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ. ఉత్తరప్రదేశ్ డీజీపీ జగ్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. త్వరలో రిటైర్ కాబోతున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ అసహనంగా స్పందించారు. జర్నలిస్టులపై రెచ్చిపోయారు. అత్యాచారాలు చాలా సాధారణమని, రామరాజ్యంలో కూడా రేప్‌లు జరిగాయంటూ వివాదాస్పదంగా మాట్లాడి సంచలనం రేపారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల గురించి మీడియా ప్రశ్నించినపుడు.. ''మహిళలపై అఘాయిత్యాలను ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి. రామరాజ్యంలో కూడా రేప్ లు జరిగాయి'' అంటూ మీడియాపై ఎగిరిపడ్డారు. దీనిపై మరింత వివరణ కోరిన జర్నలిస్టుతో 'నన్ను ప్రైవేట్ గా కలువు, అప్పుడు దీనికి జవాబు చెబుతా' అన్నారు. మహిళలపై అత్యాచారాలను పోలీసులు కూడా పూర్తిగా అరికట్టలేరంటూ తేల్చి పారేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీ వివాదాస్పదంగా స్పందించడంపై పలువురు మండిపడుతున్నారు. డీజీపీ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు, మహిళా, ప్రజాసంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. ఆయన పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు. -
’భూకంపాలు ’వచ్చినా కూలని బిల్డింగ్స్
-
హనుమాన్ జయ౦తి రోజున అద్భుత౦
-
పెళ్లి పుత్రికలు
శ్రమదానం, అవయవదానం, అన్నదానం ఇలా వివిధ రకాలుగా సమాజసేవలందిస్తున్న వారి గురించి మనం విని ఉంటాం. కానీ కన్యాదానం చేసేవారిని మనం చాలా తక్కువమందిని చూసి ఉంటాం. అలాంటి వారిలో సూరత్‌లో మహేష్‌భాయి సవాని పేరును ముందుగా చెప్పుకోవాలి. పేదరికంతో మగ్గుతూ తండ్రిని కోల్పోయిన యువతులకు తండ్రిస్థానంలో నిలిచి కన్యాదానం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వ్యాపారవేత్త. ఆయనతో ‘ఫ్యామిలీ’ సంభాషణ. ఇంతటి ఉదాత్తమమైన కార్యక్రమాన్ని ఎప్పటినుంచి ప్రారంభించారు? 2008 నుంచి. ఆ ఏడాది మా సోదరుని (కజిన్) ఇద్దరి కూతుళ్లకు వివాహం జరిపించాను. తాజాగా 2014 నవంబర్ 30న జరిపించిన 111 పెళ్లిళ్లతో ఇప్పటి వరకు మొత్తం 251 వివాహాలయ్యాయి. తండ్రిని కోల్పోయిన యువతులకు వివాహాలు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ముందుగా చెప్పినట్టు మా కజిన్‌బ్రదర్ కూతుళ్ల పెళ్లి 2008లో నిశ్చయమైంది. అనంతరం పెళ్లికి నాలుగు రోజుల ముందు ఆయన మరణించారు. ఈ వార్త ఆయన కూతుళ్లతోపాటు మా వదిననూ తీవ్రమైన దుఃఖంలోకి నెట్టేసింది. ఒక విధంగా వారు షాక్‌లోకి వెళ్లిపోయారు. నా కర్తవ్యం ఏమిటో నాకు తెలిసింది. వారికి తండ్రిలేని లోటు తెలియకుండా పెళ్లి చేశాను. అత్తారింటికి సాగనంపాను. ఆ సమయంలో వారిలో చూసిన ఆనందం నేను ఇంకా మరిచిపోలేదు. ఆ క్షణంలోనే నాకో ఆలోచన వచ్చింది. తండ్రిని కోల్పోయిన పేద యువతులకు అండగా నిలిచి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఒక తండ్రి తన కూతురికి ఇచ్చి అత్తారింటికి సాగనంపినట్టుగానే ప్రతి ఒక్కరికి బంగారం, వెండి నగలతోపాటు ఇతర వస్తువులను కూడా మా సంస్థ పి.పి.సవాని గ్రూపు తరఫున కానుకలుగా అందజేస్తున్నాం. ఏటా నవంబరు డిసెంబర్ నెలల్లోనే వివాహలు జరిపిస్తున్నారు! నిజమే. నవంబరు చివరి వారం లేదా డిసెంబరు మొదటివారంలో ఈ వివాహాల వేడుకను జరుపుతున్నాం. మా పెదనాన్న పోపట్‌బాయి ప్రేమ్‌జీబాయి సవాని (పి పి సవాని) పేరుతో మేము పలు సేవా సంస్థలు ఏర్పాటు చేశాం. ఆయన వర్ధంతి డిసెంబరు ఆరవ తేదీ. ఆయన ఙ్ఞాపకార్థంగా డిసెంబరు ఆరవ తేదీకి ముందు లేదా తర్వాత మంచి ముహూర్తం చూసి తేదీలను ఖరారు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ముహూర్తపు తేదీలు కూడా నిర్ణయమయ్యాయి. 2015 డిసెంబరు ఆరవ తేదీన కన్యదానాలు చేస్తున్నాము. భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పేదలలో సంతోషాన్ని నింపేందుకు ప్రయత్నించడమే మా ప్రణాళిక. వితంతువులుగా మారిన చెల్లెళ్లను కూడా చేరదీస్తున్నాం. ఇంతటితో ఆగకుండా పి పి సవాని ఆసుపత్రిలో వీరందరికి ఉచితంగా జీవితాంతం ఉచిత వైద్యసేవలందిస్తున్నాం. మీకు ఎంతమంది సంతానం..? ఇద్దరు అబ్బాయిలు, 251 మంది కుమార్తెలు. కన్యాదానం చేసినవారందరు నా కూతుళ్లే. అందుకే వివాహం చేసిన అనంతరం కూడా వారందరిని సంవత్సరానికి ఒకసారి ఏదో ఓ యాత్రద్వారా అందరిని ఒకచోటికి చేరుస్తున్నాం. వితంతువులందరు కూడా రాఖీపౌర్ణమీ రోజున నాకు రాఖీ కట్టేందుకు వస్తారు. ఇది నాకెంతో సంతోషాన్నిస్తుంది. - గుండారపు శ్రీనివాస్, ‘సాక్షి’, ముంబై